E-Paper
Advertisement

Goa Viral Video : కారుపై పిల్లలు నిద్ర .. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Goa Viral Video :  కారుపై పిల్లలు నిద్ర .. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Advertisement

Goa Viral Video : ప్రయాణ సమయంలో తమ కార్లలో ప్రయాణికులు నిద్రపోవడం కామన్. కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా కారు రూఫ్ టాప్ పై నిద్రిస్తున్నట్లు చూశారా? నిజంగా ఇలాంటి ఘటన జరిగింది. గోవాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పర్రా కోకోనట్ ట్రీ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. గోవాలోని ఒక పర్యాటకుడు కారు రూఫ్ టాప్ పై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలతో SUV నడుపుతూ వెళ్లాడు.

ఈ ఘటనపై ఆందోళన చెందిన ఓ వ్యక్తి డ్రైవరు వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. పిల్లలను కారు కదులుతున్నప్పుడు దాని పైన పడుకోబెట్టడాన్ని ప్రశ్నించాడు. డ్రైవర్ స్పందిస్తూ తాను రివర్స్ టర్న్ తీసుకుంటున్నానని చెప్పాడు. ఇద్దరు పిల్లలు కారు రూఫ్ టాప్ పై నిద్రిస్తుండగా ఎస్‌యూవీ కారు వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 27 న ట్విట్టర్ ( X) లో ఈ వీడియో కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×