E-Paper
Advertisement

Khammam : మాటలతో మోసం.. వృద్ధురాలి మెడలో చైన్ స్నాచింగ్..

Khammam : మాటలతో మోసం.. వృద్ధురాలి మెడలో చైన్ స్నాచింగ్..
Advertisement
local news telangana

Khammam latest news(Local news telangana):

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం గ్రామం సమీపంలో వృద్ధురాలి మెడలో చైన్ ను గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కెళ్లారు. లాలాపురం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కొత్త సావిత్రమ్మ అనే వృద్ధురాలు నడిచి వెళ్తుండగా బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. రోడ్డు పక్కన సుబాబుల్ తోట ఎవరిదని అడుగుతూ మాటల్లో పెట్టి.. చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. అనంతరం వృద్ధురాలిని రోడ్డు పక్కకు నెట్టివేశారు.

ఆమె కింద పడిపోవడంతో వెంటనే మెడలో ఉన్న మూడు తులాల గొలుసును లాక్కొని బైక్ పై పరారయ్యారు. సావిత్రమ్మ వెంటనే కేకలు వేయడంతో స్థానికులు దగ్గరకు వచ్చి విషయం తెలుసుకుని కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొలుసు విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ రహమాన్, సిఐ సాగర్, ఎస్ఐ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×