E-Paper
Advertisement

Android Apps: ఆ యాప్ లను తొలగించండి.. యూజర్లకు గూగుల్ సూచన

Android Apps: ఆ యాప్ లను తొలగించండి.. యూజర్లకు గూగుల్ సూచన
Advertisement

Android Apps: డిజిటల్ యుగంలో.. డేటా భద్రత చాలా ముఖ్యం. యూజర్లు అప్రమత్తంగా లేకపోతే వ్యక్తిగత వివరాలన్నీ థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లే. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయి. అందుకే గూగుల్ యూజర్ల భద్రత దృష్ట్యా ఎప్పటికప్పుడు మాల్ వేర్ యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తోంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మరో 13 యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు కూడా వెంటనే ఆయా యాప్ లను ఫోన్ ల నుంచి తొలగించాలని సూచించింది.

తాజాగా తొలగించిన 13 యాప్ లలో హెల్త్, గేమింగ్, రాశిఫలాలు, ప్రొడక్టివిటీకి సంబంధించిన యాప్ లు ఉన్నాయి. ఈ యాప్ లు యూజర్ ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేయడమే ఆలస్యం. సోషల్ ఇంజినీరింగ్ ద్వారా యూజర్ ప్రమేయం లేకుండా డివైజ్ ను యాక్సెస్ చేసి.. ఆండ్రాయిడ్ చేసే అన్నిరకాల అలర్ట్ మెసేజ్ లను డిజేబుల్ చేస్తాయి. ఆపై సైబర్ నేరస్తుల ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుని.. ప్రకటనలపై క్లిక్ చేయడం, మోసపూరిత ఆర్థిక లావాదేవీలను నిర్వహించే యాప్ లను ఇన్ స్టాల్ చేయడం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు మెకాఫే వెల్లడించింది. యూజర్లు ఎవరైనా ఆయా యాప్ లు ఇన్ స్టార్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ సూచించింది.

Advertisement

Essential horoscope for android, 3D skin editor for PE minecraft, Logo maker Pro, Auto Click Repeater, Count easy calorie calculator, sound volume extender, letter link, numerology : personal horoscope and number predictions, step keeper : easy pedmeter, track your sleep, sound volume booster, astrological navigator: daily horoscope&tarot, universal calculator యాప్ లు గూగుల్ తొలగించిన యాప్ ల లిస్ట్ లో ఉన్నాయి.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×