BigTV English

Rahul on Doda Terror Attack: దోడా ఉగ్ర ఘటనపై రాహుల్ సీరియస్.. మీరే కారణమంటూ..!

Rahul on Doda Terror Attack: దోడా ఉగ్ర ఘటనపై రాహుల్ సీరియస్.. మీరే కారణమంటూ..!
Advertisement

Rahul Gandhi Serious on Doda Terror Attack: జమ్మూకాశ్మీర్ లో దోడా జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడిపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గత కొన్ని నెలలుగా భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడులు పెరగడం ఆందోళనకరమన్నారు. జమ్మూకాశ్మీర్ లోని పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ చేశారు.


‘నేడు జమ్మూకాశ్మీర్ లో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. వరుసగా ఉగ్రదాడులు జరగడం ఆందోళనకరం. ఈ దాడులు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేస్తున్నాయి. బీజేపీ తప్పుడు రాజకీయాల ఫలితాలను జవాన్లు, వారి సైనికులు అనుభవిస్తున్నారు. ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. దేశ సైనికులకు హానిచేసేవారిపై కఠినంగా వ్యవహరించాలి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి’ అంటూ ఎక్స్ ఖాతాలో రాహుల్ అన్నారు.

అయితే, జమ్మూకాశ్మీర్ లో గత 32 నెలల నుంచి ఉగ్ర దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడిలో ఇప్పటివరకు 48 మంది సైనికులు మృతిచెందారు. ఈ నెలలో రెండు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో జరిగిన జంట దాడుల్లో కూడా ఆరుగురు సైనికులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.


Also Read: బెంగుళూరులో ఆటోమెటిక్ పానీపూరి మెషిన్.. వాటర్ మాటేంటి?

ఇటీవలే చోటు చేసుకున్న ఉగ్రదాడుల వివరాలు..

  • ఏప్రిల్ 22న రాజౌరీ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపారు.
  • ఏప్రిల్ 28న ఉధంపుర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో గ్రామరక్షక సిబ్బందిలో ఒకరు మృతిచెందారు.
  • మే 4న పూంఛ్ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో వాయుసేన సిబ్బంది చనిపోయారు.
  • జూన్ 9న రియాసి జిల్లాలో పర్యాటక వాహనంపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. దీంతో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Protestors: పారిశ్రామికవేత్త కోసం నిరసనకారులపై పోలీసుల కాల్పులు: మద్రాస్ హైకోర్టు

  • జూన్ 11, 12 తేదీల్లోనూ కఠువా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందారు.
  • జులై 8న కఠువా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది మృతిచెందారు.
  • దోడా జిల్లాలో జులై 16న జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Related News

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు

Supreme Court: దీపావళి బాణాసంచా పేలుళ్ల పై.. సుప్రీం రూల్స్

Goa: తీవ్ర విషాదం.. గోవా మాజీ సీఎం కన్నుమూత

PM Shram Yogi Maan Dhan scheme: రూ.55 చెలిస్తే చాలు.. ప్రతీ నెలా 3 వేల రూపాయలు, ఆ పథకం వివరాలేంటి?

Big Stories

×