BigTV English

Panipuri Machine in Bangalore: బెంగుళూరులో ఆటోమెటిక్ పానీపూరి మెషిన్.. వాటర్ మాటేంటి..?

Panipuri Machine in Bangalore: బెంగుళూరులో ఆటోమెటిక్ పానీపూరి మెషిన్.. వాటర్ మాటేంటి..?

Automatic Panipuri Machine in Bangalore City: పానీపూరీ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఇందులో క్యాన్సర్‌‌కి సంబంధించిన పదార్ధాలు ఉండటమే అసలు కారణం. ఈ నేపథ్యంలో దీనిపై నిషేధం విధించేందుకు పలు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. తాజాగా బెంగుళూరులో పూనీపూరీ మెషిన్ అందు బాటులోకి వచ్చేసింది.


కర్ణాటకలో పానీపూరీ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఆ రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీలు, సర్వేల్లో అస్సలు పానీపూరీ తినడానికి పనికిరావని తేలింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. అపరిశుభ్ర వాతావరణంలో పానీపూరీని విక్రయించడం, పరిశుభ్రత పాటించకపోవడమే కారణమని తేల్చారు.

తాజాగా బెంగుళూరులో ఆటోమెటిక్ పానీపూరీ కియోస్క్ అందుబాటులోకి వచ్చేసింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అటోమెటిక్ పానీపూరీ మెషిన్ పేరు డబ్ల్యూటీఎఫ్. సింపుల్‌గా వాట్ ద ఫ్లేవర్స్ అనేది ఫుల్ నేమ్.


పానీపూరీలో వినియోగించే వాటర్ కోసం పలు ట్యాప్‌లు దీనికి అమర్చారు. పలు ఫ్లేవర్లతో కూడిన వాటర్ ఉంటుంది. వినియోగదారులు తమకు నచ్చిన ప్లేవర్ వాటర్‌ని ఎంచుకోవచ్చు. ఈ విషయంలో పరిశుభ్రత కు పెద్ద పీఠ వేశారు తయారీదారులు. ఇంతవరకు బాగానేవుంది.. మరి వాటర్ తయారీ మాటేంటి అన్నదే అసలు ప్రశ్న.

Also Read: బీహార్‌లో దారుణం, వీఐపీ చీఫ్ ముఖేష్ సహానీ తండ్రి హత్య

ఇటీవల కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు పానీపూరీ షాపులను తనిఖీలు చేశారు. పూనీపూరీలో వినియో గించే గ్రీన్‌ కలర్ వాటర్‌లో కొన్ని కెమికల్స్ వాడుతున్నట్లు తేలింది. బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలున్న గుర్తించారు. కేవలం రంగు కోసమే కెమికల్స్ వాడుతున్నట్లు తేల్చారు.

ఆటోమెటిక్ పానీపూరీ మిషన్‌ నుంచి రకరకాల ఫ్లేవర్ వాటర్ ప్రత్యేకత ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్త ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు పానీ‌పూరీ లవర్స్. ఈ డీటేల్స్ బయటకు వస్తే..దేశ‌వ్యాప్తంగా పానీపూరీ  కియోస్క్‌లు అందుబాటులోకి రావడం ఖాయమని అంటున్నారు.

Tags

Related News

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Rahul Mamkootathil: సినీ నటి ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్

Heavy Rains: దేశాన్ని వణికిస్తున్న వాన బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవులు

Delhi News: ఢిల్లీ సీఎం రేఖాపై దాడి కేసు.. తీగలాగితే డొంక కదులుతోంది, కొత్త విషయాలు బయటకు

BJP New Chief: బీజేపీ కొత్త అధ్యక్షులెవరు? ఈసారి ఉత్తరాదికే ఛాన్స్

Big Stories

×