BigTV English

Gujarat Election : గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..రెండు విడతల్లో పోలింగ్

Gujarat Election : గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..రెండు విడతల్లో పోలింగ్

Gujarat Election : గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్‌, డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటించనున్నారు.నవంబర్ 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. తొలిదశలో 89 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. రెండో దశలో 93స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.


గుజరాత్‌ లో 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 99 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలతో కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.

ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఆ రాష్ట్రంలో నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్ 8న కౌంటింగ్‌ చేపడతారు.


Related News

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

×