BigTV English

Gujarat : న్యూఇయర్‌ వేళ.. సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డ్‌..

Gujarat : న్యూఇయర్‌ వేళ.. సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డ్‌..

Gujarat : నూతన సంవత్సరాన్ని గుజరాత్ ప్రభుత్వం సరికొత్తగా ఆహ్వానించింది. ఒకే సారి 108 ప్రాంతాల్లో సామూహిక సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్‌ సాధించారు. అహ్మదాబాద్‌ ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటిచెబుతూ గుజరాత్‌ ప్రభుత్వం సరికొత్తగా రికార్డు సృష్టించింది. ఏక కాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. ప్రసిద్ధ మోధెరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లోఈ రోజు ఉదయం ఈ సూర్య నమస్కారాలు చేశారు.


108 ప్రాంతాల్లో దాదాపు 4 వేల మందికి పైగా సూర్య నమస్కార ఆసనం వేశారు. విద్యార్థులు, పలు కుటుంబాలు, యోగా ఔత్సాహికులు, వయో వృద్ధులు ఇందులో పాల్గొన్నారు. 51 విభిన్న కేటగిరీలకు చెందిన వారు ఈ సూర్యనమస్కారాలను ప్రదర్శించారు.

మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, హోం మంత్రి హర్ష్‌ సంఘ్వీ, మంత్రలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్ ప్రతినిధి హాజరయ్యారు. గుజరాత్‌ రికార్డ్‌ సాధించినట్లు ప్రకటించారు.


అత్యధిక మంది ఒకేసారిగా సూర్యనమస్కారాలు చేయడంలో ఇదే తొలి రికార్డ్‌. గతంలో ఇప్పటివరకూ ఎవరూ ఇలాంటి రికార్డ్‌కు ప్రయత్నించలేదు. అయితే ఈ రికార్డ్‌ను గుజరాత్ సొంతం చేసుకుంది. అని గిన్నిస్‌ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

గిన్నీస్ రికార్డ్ సాధించినటువంటి సూర్య నమస్కారాలు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ప్రధాని మోదీ పంచుకున్నారు. ఈ 2024ను గుజరాత్ అరుదైన ఘనతతో స్వాగతించిందన్నారు. 108 వేదికల్లో ఒకేసారి అత్యధిక మంది సూర్యనమస్కారాలు చేశారన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో 108 సంఖ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసని మోదీ తెలిపారు.

యోగా, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శన మన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ పనుల్లో సూర్యనమస్కారాన్ని భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ లో రాసుకున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×