Big Stories

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

H3N2: దేశంలో H3N2 వైరస్ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు ఈ మహ్మరి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా రెట్టింపవుతోంది. కొన్నిచోట్ల ఆసుపత్రులన్నీ పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,038 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

ఇక ఈ మహమ్మారికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. H3N2 కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ మహమ్మారి భారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. కానీ అందోళన చెందాల్సిన అవసరం లేదని.. మార్చి చివరి నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

- Advertisement -

ప్రతి ఏటా ఈ మహమ్మారి వ్యాప్తి దేశంలో రెండు సార్లు ఉంటుందని.. అందులో ఒకటి జనవరి నుంచి మార్చి మధ్య ఉంటుందని వెల్లడించింది. ఈక్రమంలో మార్చి చివరి నాటికి కేసులు సంఖ్య తగ్గుతాయని అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారిని విజయవంతంగా జయించవచ్చిని సూచించింది.

మరోవైపు ఈ మహమ్మారి కారణంగా దేశంలో రెండు మరణాలు సంభవించాయి. హరియాణాలో 56 ఏళ్ల వ్యక్తి చనిపోగా.. కర్ణాటకలో 82 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈక్రమంలో జనాలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News