BigTV English

Honda Hands-free Wheelchair : శరీరభంగిమలతో కదిలే వీల్‌చైర్

Honda Hands-free Wheelchair : శరీరభంగిమలతో కదిలే వీల్‌చైర్

Honda Hands-free Wheelchair : ఆ వీల్‌ఛైర్ వెరీస్మార్ట్. అందులో కూర్చున్న వారి శరీరం భంగిమలను బట్టి అది డైరెక్షన్ మార్చుకుంటుంది. శరీరం ఎటు వంగితే ఆ దిశగా కదులుతుంది. జపాన్ సంస్థ హోండా ఈ హ్యాండ్స్-ఫ్రీ వీల్‌చైర్‌ను రూపొందించింది. మొబిలిటీ సమస్య ఉన్న దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని హోండా రోబోటిక్స్ విభాగం యూనీ-వన్ వీల్‌చైర్‌ను డిజైన్ చేసింది.


ఈ వీల్‌చైర్‌కు చేతులు ఉండవు. మోటారైజ్డ్ సీటుపై కూర్చుని..చేతులను ఫ్రీగా వదిలేయవచ్చు. చేతులతో అన్ని పనులూ చేసుకోవచ్చు. ఆటలు ఆడటం నుంచి వస్తువులను అందుకోవడం వరకు ఏవైనా చేసుకునే వీలుంది. యూజర్లు ఈ కుర్చీలో ఆశీనులై.. చేతులను ఫ్రీగా వదిలివేసినప్పుడు అవసరమైన మేర తన ఎత్తును తనంతట తానుగా అడ్జస్ట్
చేసుకోగలదు. మానవ కదలికలతో సమన్వయం చేసుకోగల బ్యాలెన్స్ కంట్రోల్ టెక్నాలజీని హోండా ఇంజనీర్లు ఆ వీల్‌చైర్‌కు అనుసంధానించారు.

ఈ టెక్నాలజీలో భాగంగా పోస్చర్(posture) సెన్సర్ ఉంటుంది. మనిషి కదలికలను ఆ సెన్సర్ గ్రహిస్తుంది. అందుకు
అనుగుణంగానే ముందుకు, వెనుకకు కదులుతుంటుంది. సాధారణ వీల్‌చైర్లను చేతులతోనే నియంత్రించాల్సి ఉన్నందున వేరొక పని చేయడానికి వీలుండగా. కేవలం వీల్‌చైర్‌ను కదపడానికే అవి పరిమితమవుతాయి. హ్యాండ్స్-ఫ్రీ
వీల్‌చైర్ అలా కాదు. రెండు చక్రాల సెగ్వే పరికరం, సాధారణ వీల్‌చైర్ కలగలిపితే వచ్చిందే హ్యాండ్స్-ఫ్రీ వీల్‌చైర్.


జపాన్‌లో నిర్వహించిన మొబిలిటీ షో-2023లో హోండా రోబోటిక్స్ దీనిని ప్రదర్శించింది. దీనిలో కూర్చుని చేతులను ఫ్రీగా వదిలేసి.. శరీరాన్ని ఎటు వంచితే ఆ బరువుకు అటు తిరుగుతుంది. యూనీ-వన్ వీల్‌చైర్‌ నియంత్రణలో చేతులు జాయ్‌స్టిక్‌లా ఉపయోగపడతాయి.

బ్యాటరీ సాయంతో నడిచే ఈ చైర్ రెండు గంటల పాటు పనిచేస్తుంది. లేదంటే 8 కిలోమీటర్ల దూరం వరకు కదలగలదు. వేగం గంటకు 6 కిలోమీటర్లు. ప్రస్తుతం ప్రొటోటైప్‌నే తయారు చేసినందున.. భవిష్యత్తులో వీటి తయారీలో కొన్ని మార్పుచేర్పులు చేసే అవకాశం ఉంది. 2025 నాటికి అమెరికా, జపాన్ మార్కెట్లోకి ప్రవేశపెడతామని హోండా సంస్థ చెబుతోంది.
యూనీ-వన్ తరహాలోనే 2020లో ఎస్-పాడ్ అనే కాన్సెప్ట్‌ను సెగ్వే ప్రతిపాదించింది. అలాగే లండన్ ఆర్కిటెక్ట్ సుజన్నేబ్రీవర్ ‘వాకింగ్ వీల్ చైర్’కు డిజైన్ చేశారు. ఇవి ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్నాయి. అయితే అరిజోనాకు చెందిన మొబిలిటీ కంపెనీ ఓమియో ఇప్పటికే హ్యాండ్స్-ఫ్రీ వీల్‌చైర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×