Hidma Hometown: మావోయిస్టులకు ఏళ్ల తరబడి బ్యాక్ బోన్‌గా నిలిచిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా హతంతో వారి ఉద్యమానికి ఫుల్‌స్టాప్ పడిందా? దేశవ్యాప్తంగా 95 శాతం మావోయిస్టులు లొంగిపోవడం, ఎన్‌కౌంటర్‌లో హతం కావడం జరిగిందా? కేవలం ఐదు శాతం ఉన్నారా? అక్కడక్కడ మావోల సానుభూతిపరులు ఉన్నారా? దళ సభ్యుడి నుంచి ప్రస్తానం మొదలు పెట్టిన హిడ్మా, భారీ ఆపరేషన్లు చేపట్టాడు. హిడ్మా దెబ్బకు వందలాది మంది జవాన్లు నేల కొరిగారు. గెరిల్లా వార్‌ఫేర్‌లో అనుభవంతో బలగాలపై భారీగా దాడులు చేయడంలో హిడ్మా దిట్ట. ఆపై మాస్టర్‌మైండ్ కూడా.
చత్తీస్‌గఢ్ లో పూవర్తి గ్రామం హిడ్మా సొంతూరు
ఇంతకీ హిడ్మా ఎక్కడివారు? బలగాలు కేవలం ఆయన్ని ఎందుకు టార్గెట్ చేశాయి? ఆయన హతం తర్వాత మావోయిస్టులు తుడిచి పెట్టుకుపోయారని పౌరసంఘాల హక్కుల నేతలు చెబుతున్నారు. చత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. మురియా తెగకి చెందినవాడు హిడ్మా. స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత పాఠశాల విద్యకు గుడ్ బై చెప్పేశాడు. కనీసం 50 ఇళ్ళు లేని పువ్వర్తి నుండి దాదాపు 90 మంది యువకులు మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళారంటే హిడ్మా ప్రభావం ఆ యువకులపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హిడ్మా సొంతూరులో కనీసం 50 ఇళ్ళు ఉంటాయి. అక్కడి యువకులు మావోయిస్టుల వైపు వెళ్లకుండా కట్టడి చేయడానికి పువ్వర్తిలో 3000 మందితో బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం. హిడ్మా గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నామని చెప్పడానికి జాతీయ జెండాను ఎగుర వేశాయి బలగాలు. ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించి తమ సత్తాను నిరూపించుకుంటామని లోక్‌సభ ఎన్నికలో శత విధాలుగా అధికారులు ప్రయత్నాలు చేశారు.
15 ఏళ్ల వయస్సులో పీపుల్స్‌వార్‌లోకి
పువ్వర్తి గ్రామంలోని బూత్ పరిధిలో 547 మంది ఓటర్లకు గాను కేవలం ఓటు వేసినవారు కేవలం 31 మంది మాత్రమే. 31 మందిలో ఒక్కరు కూడా ఆ గ్రామానికి చెందినవారు కారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే హిడ్మాపై ఆ గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉన్న బలమైన నమ్మకం. ఛత్తీస్‌ఘడ్ డిప్యూటీ సీఎం, ఆనాటి హోం మంత్రి విజయ్ శర్మ హిడ్మా గ్రామాన్ని సందర్శించారు. హిడ్మా తల్లి మద్వి పుంజీ, తల్లి బర్సే సింగేలను కలిసి కొడుకుని లొంగిపోవాలని కోరారు. అందుకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు కూడా.
సరిగ్గా చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా 1974 లో జన్మించాడు. పాఠశాల విద్యకు మధ్యలో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో పీపుల్స్ వార్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో 15 వ ఏట ఆకర్షితులయ్యాడు.. అందులో చేరాడు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాలీ, కోయ, మురియా, గోండి భాషలపై పట్టు సాధించాడు. ప్రతీరోజూ తెల్లవారుజామున నాలుగింటికే నిద్ర లేచి బెటాలియన్‌తో పరేడ్ నిర్వహించిన తర్వాత దినచర్య మొదలుపెట్టేవాడు. సరిగ్గా మూడు దశాబ్దాల కిందట 1996లో పామేడు రేంజ్ కమిటీలో సభ్యుడిగా చేశాడు.
ALSO READ: దేశాభివృద్ధికి చైనా బెస్ట్.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు
రెండేళ్ల తర్వాత ఏరియా కమిటీ సభ్యుడిగా మారిపోయాడు. ఆ తర్వాత లోతువాగు అంబుష్ సందర్భంగా అతడి కాలికి గాయమైంది. కోలుకున్ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు రామన్న దగ్గర శిక్షణ పొందాడు. 2002 ఏడాదిలో డివిజినల్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యాడు. కుంట ఏరియా కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించాడు కూడా. 2005 లో కాయ్-2, ప్లటూన్-1 కమాండర్‌గా పని చేసిన అనుభవం హిడ్మా సొంతం. 2007లో మరో ప్లటూన్ ఏర్పాటు చేయడం, దానికి కమాండర్‌గా నియమించారు.
2009లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్‌గా పని చేశారు. అతడి శక్తిసామర్థ్యాలను గురించిన అగ్రనేతలు 2014లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ప్రస్తుతం దానికి కార్యదర్శిగా ఉంటూ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. హిడ్మా రొట్టెలు ఎక్కువగా తినేవారని, అంతేకాదు మాంస ప్రియుడని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. దక్షిణ బస్తర్‌లో అతడికి పట్టు ఉండటంతో పోలీసుల దాడుల నుంచి తప్పించుకున్నాడు కూడా.
ఆటోమేటిక్ రైఫిల్స్, ఐఈడీ సాంకేతికతలో నైపుణ్యం హిడ్మా సొంతం. రాత్రిపూట పర్వత ప్రాంతాల్లో స్టెల్త్ దాడులు చేయడంలో అతడికి తిరుగులేదని చెబుతారు. ఈ కారణంగా అర్ధరాత్రి వేళ సీఆర్పీఎఫ్ క్యాంపులపై దాడులు నిర్వహించాడు. అలాంటి దాడి 2010లో జరిగింది. దంతెవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్ చింతల్నార్ క్యాంపుపై చేసిన దాడిలో 76 మంది జవాన్లు మరణించారు. హిడ్మా చేసిన అతిపెద్ద దాడి కూడా ఇదే. హిడ్నా దాడి చేశాడంటే కనీసం 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఆ స్థాయి ఆపరేషన్ అయితేనే ప్లాన్ చేసేవాడు.