BigTV English
Advertisement

Historical Monuments: చరిత్ర చెప్పే బ్రిటీష్ కట్టడాలు..!

Historical Monuments: చరిత్ర చెప్పే బ్రిటీష్ కట్టడాలు..!
British colonial history

Historical monuments built during the British: శ‌తాబ్దాల బ్రిటిష్ పాలనలో మన దేశంలో పలు నిర్మాణాలు జరిగాయి. వలసపాలన చిహ్నాలుగా చరిత్రకెక్కిన పలు విలక్షణ భవనాలు, వాటి విశేషాలు మీకోసం..


రైట‌ర్స్ బిల్డింగ్‌
పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ భవనం పేరు రైటర్స్ బిల్డింగ్. నాటి ఈస్ట్‌ఇండియా కంపెనీకి సంబంధించిన రచయితలకు వసతి కల్పించడానికి 1777లో నిర్మించిన ఈ భవనాన్ని థామస్ లియోన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ డిజైన్ చేశారు. కోల్‌కతాలోని తొలి మూడంతుస్తుల భవనం ఇదే. నాటినుంచి అనేక కీలక నిర్ణయాలకు ఈ భవనం వేదికగా మారింది. దీనికి అనుగుణంగా ఓ స్మారక చిహ్నం, పలు ఉప నిర్మాణాలు జరిగాయి.

సెయింట్ పాల్స్ కేథడ్రల్
బ్రిటిష్ ప్రభుత్వం స్వయంగా పూనుకుని విదేశంలో నిర్మించిన తొలి చర్చి ఇదే. 1847లో విలియం నైర్న్ ఫోర్బేస్చ్ అనే బ్రిటిష్ ఇంజనీరు దీనిని డిజైన్ చేశారు. వలస పాలనలో నిర్మితమైన అత్యుత్తమ కట్టడాల్లో ఒకటిగా గుర్తింపుపొందిన ఈ చర్చి యూరోపియన్ శైలిని పోలి ఉంటుంది. దీని ఎత్తైన పైకప్పు, అందమైన గాజు కిటికీలు, గోడలపై కన్నుచెదిరే చిత్రకళా రూపాలు, చెక్కశిల్పాలు గురించి ఎంత చెప్పినా తక్కువే.


Red more: అన్నదాతల పోరు.. అందరిదీ కావాలి..!

ఫోర్ట్ సెయింట్ జార్జ్
మనదేశంలో ఆంగ్లేయులు నిర్మించిన తొలికోట ఇది. చెన్నై బీచ్‌లో 1640లో నిర్మితమైన ఈ కోట చాలాకాలం ఈస్టిండియా కంపెనీ ట్రేడింగ్ కేంద్రంగా ఉంది. కాలక్రమంలో అనేకసార్లు దీనిని పునరుద్ధరించారు.

బాంబే హైకోర్టు
1862లో బ్రిటిష్ ఇండియాలో స్థాపించిన తొలి 3 హైకోర్టులలో బాంబే హైకోర్టు ఒకటి. ఈ భవనపు పశ్చిమ భాగంలో న్యాయ దేవత విగ్రహం ఉంది. ఈ భవనంలో నాటి వలన పాలనను సూచించే పలు ఉప నిర్మాణాలున్నాయి.

సె కేథడ్రల్
ఆసియాలో అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందిన ఈ నిర్మాణం సెయింట్ కేథరిన్ ఆఫ్ అలెగ్జాండ్రియాకు అంకితం చేయబడింది. గోవాలో 1940లో నిర్మించిన ఈ చర్చిలో 5 భారీ గంటలున్నాయి. వీటిలో బంగారు గంట కూడా ఒకటి. రమ్యమైన వర్ణచిత్రాలు, కుడ్యచిత్రాలతో కూడిన ఈ చర్చి అలెగ్జాండ్రియాలోని సెయింట్ కేథరీన్ జీవితాన్ని ప‌రిచ‌యం చేస్తుంది.

రాష్ట్రపతి భవన్
బ్రిటీష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ ల్యూటెయిన్స్, చీఫ్ ఇంజనీర్ హగ్ కీలింగ్ పర్యవేక్షణలో ఈ భవనం నిర్మితమైంది. 1912 నుంచి 1929 దాకా సాగిన ఈ భవన నిర్మాణంలో 29వేల మంది కార్మికులు పాల్గొన్నారు. దాదాపు 9లక్షల పౌండ్లు ఖర్చు లెక్కతేలింది. 1931లో ప్రారంభమైన ఈ భవనం ప్రపంచపు రెండవ అతిపెద్ద అధ్యక్షభవనంగా రికార్డుకెక్కింది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 340 రూములతో ఆశ్చర్యం కలిగిస్తుంటుంది! అందులో 54 బెడ్ రూములు, విదేశీ అతిథుల కోసం సూట్లు ఉన్నాయి. ప్రధాన భవంతికి పశ్చిమాన మొఘల్ గార్డెన్, ఇందులోని అశోకా హాల్, దర్బారు హాల్ మొఘల్, బ్రిటిష్ కాలపు కళా కౌశలానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

Tags

Related News

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Big Stories

×