BigTV English

Budget 2024: ‘బడ్జెట్‌లో పర్యాటక రంగం జిఎస్‌టీ 12 శాతానికి తగ్గించండి’.. ప్రభుత్వానికి ట్రావెల్, హోటల్స్ సంఘం విన్నపం

Budget 2024: ‘బడ్జెట్‌లో పర్యాటక రంగం జిఎస్‌టీ 12 శాతానికి తగ్గించండి’.. ప్రభుత్వానికి ట్రావెల్, హోటల్స్ సంఘం విన్నపం

Budget 2024: దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి.. జిసిటి పన్నుని తగ్గించాలని ముఖ్యంగా త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో హోటళ్ల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్‌పై 12 శాతం విధించాలని ట్రావెల్ సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2024-25 ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో జూలై 23న సమర్పించనున్నారు.


పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఒక యూనిఫార్మ్ జిఎస్‌టి రేట్ తీసుకురావాలని, ఆన్ లైన్ ట్రావెల్ సేవలందించే మేక్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు, సిఈఓ రాజేష్ మాగో అన్నారు. దీనివల్ల నియమాలు పాటించడం చాలా సరళంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ”హోటల్ రంగంలో రెండు రకాల జిఎస్ టి ఉండడం వల్ల రూమ్ టారిఫ్ ధరలలో వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు సీజన్ డిమాండ్ ఉన్నప్పుడు ఒక హోటల్ రూమ్ ఒక రాత్రికి రూ.10000 ఉంటే దానిపై 18 శాతం జిఎస్‌టి ఉంటుంది. అదే హోటల్ రూమ్ సాధారణ సమయంలో ఒక రాత్రికి రూ.7000 చెల్లించాలి.. ఇందులో 12 శాతం జిఎస్‌టి ఉంటుంది,” ధరలో ఇంత వ్యత్యాసం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకే రాబోయే బడ్జెట్‌ల పర్యటక రంగంపై ముఖ్యంగా హోటల్స్ బుకింగ్స్ పై ఒక యూనిఫామ్ జిఎస్ టీ.. 12 శాతం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి కోరుతున్నాం,” అని వివరించారు.

Also Read: కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?


పర్యవరణాని హాని చేయకుండా నీరు, కరెంటు తక్కువ ఖర్చు చేసే పరికరాలు, చెత్తను రీసైకిల్ చేసే వేస్ట్ మేనేజ్‌మెంట్ మెషీన్లు ఉపయోగించే హోటళ్లు, రిసార్ట్‌లకు టూరిజం టాక్స్ ఇన్సెంటివ్స్ ప్రకటించాలని టూరిజం నిపుణలు చెబుతున్నారు.

భారత దేశం లో పర్యాటక రంగంపై విధించే పన్ను ప్రపంచ దేశాలతో పోలీస్తే అత్యధికం
”దేశ జిడీపీ (స్ఠూల జాతీయోత్పత్తి) లో పర్యాటక రంగ సహకారం దాదాపు 10 శాతంగా ఉంది. అలాంటప్పుడు పర్యటాక రంగాన్ని ప్రత్యేక రంగంగా గుర్తింపునివ్వాలి,” అని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి అన్నారు. మన దేశ పర్యాటక రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పది కోట్లు లేదా ఆపై ఖర్చుతో నిర్మించిన పెద్ద హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లకు ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇవ్వాలని.. దీనివల్ల పర్యటాక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన వాఖ్యానించారు.

”ప్రపంచ దేశాలతో పొలిస్తే.. అత్యధిక పన్నులు మన దేశ పర్యాటక రంగంలో ఉన్నాయి. దీని వల్ల దేశంలో టూరిజం ఖరీదు చాలా పెరిగిపోయింది. “హోటల్ రూమ్ లపై 18 శాతం జిఎస్‌టి విధానాన్ని తొలగించి అన్నింటికీ 12 శాతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే దేశంలో బిజినెస్ చేయడానికి చట్టపరంగా పాటించే ప్రక్రియ.. కావాల్సిన అనుమతులు పొందడానికి ప్రభుత్వం ఒక సరళమైన విధానం తీసుకురావాలి. దీనికోసం సింగిల్ విండో సిస్టమ్ పద్ధతిలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ డెవలప్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటు చేయాలని..” అని ప్రదీప్ శెట్టి వ్యాఖ్యానించారు.

 

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×