BigTV English

Israel Failure: నిఘా కన్నుగప్పి..

Israel Failure: నిఘా కన్నుగప్పి..

Israel Failure: ఇజ్రాయెల్ కలలోనైనా ఊహించని దెబ్బ.. పకడ్బందీగా.. ఎంతో సమన్వయంతో జరిగిన దాడి. నిజమే. ఇది ఎలా సాధ్యమైంది? గాజా‌స్ట్రిప్‌, ఇజ్రాయె‌ల్‌ను వేరు చేసే కోటగోడ లాంటి కంచెను సైతం ధ్వంసం చేసి డజన్ల కొద్దీ పాలస్తీనియన్ సాయుధులు తమ భూభాగంలోకి ప్రవేశించేంత వరకు నెతన్యాహు సర్కారు నిద్రమత్తు వీడకపోవడం విస్మయం గొలుపుతోంది.


1973 యామ్ కిప్పూర్ యుద్ధం 50వ వార్షికోత్సవం మరుసటి రోజే 5 వేల రాకెట్లతో హమస్ విరుచుకుపడటం ఓ రకంగా ఇజ్రాయెల్‌కు కోలుకోలేని దెబ్బే. భద్రత, నిఘాపరంగా ఇంత ఘోర వైఫల్యం చోటుచేసుకోవడం ఈ తరంలో బహుశా ఇదే. ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్, నిఘా సంస్థ మొస్సాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు.. ఇవేవీ దాడి ముప్పును ఊహించలేకపోయాయి.

హమస్ దాడి ఎలా సాధ్యమైందో ఇప్పటికీ అంతు పట్టడం లేదని ఇజ్రాయెల్ అధికారులు వాపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శత్రువుల కదలికలను పసిగట్టడంలో పశ్చిమాసియాలోనే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలకు ఎంతో పేరుంది. పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులతో పాటు లెబనాన్, సిరియా.. అన్ని చోట్లా మొస్సాద్‌‌కు ఇన్ఫార్మర్లు, ఏజెంట్లు ఉన్నారు. వారి సాయంతోనే గతంలో ఎందరో మిలిటెంట్ నేతలను అంతమొందించగలిగారు.


ఇందుకోసం డ్రోన్ దాడులు జరిపిన సందర్భాలున్నాయి. ఏజెంట్ల స్థానంలో జీపీఎస్ ట్రాకర్ వంటి పరిజ్ఞానాన్ని వినియోగించారు. మొబైల్ ఫోన్లు పేలిపోయాలా చేసి తద్వారా శత్రుశేషం లేకుండా చూసిన ఉదంతాలు సరేసరి. సరిహద్దు కంచె వద్ద కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సర్లు వంటి అత్యాధునిక పరికరాలను నిఘా కోసం ఏర్పాటు చేశారు. అయినా హమస్ మిలిటెంట్లు వీటన్నింటినీ బుల్ డోజ్ చేసి మరీ.. ఇజ్రాయెల్ పట్టణాల్లోకి చొచ్చుకు రాగలిగారు.

పారాగ్లైడర్ల సాయంతో కంచె మీదుగా ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి ఉండొచ్చన్న వాదన కూడా ఉంది. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలైంది. మోటారైజ్డ్ హాంగ్ గ్లైడర్ సాయంతో ఓ మిలిటెంట్ చొరబడుతున్న తీరును ఆ వీడియో వివరిస్తోంది. ఇది నిఘా వైఫల్యమే అని ఇజ్రాయెలీలు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం ముందున్న తక్షణ కర్తవ్యం.. దక్షిణ దిశ నుంచి దేశంలోకి చొరబడిన హమస్ మిలిటెంట్లను ఏరివేయడం.

కంచె సమీపంలోని పలు పట్టణాలు ఇప్పటికే మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బేరి, ఓఫాకిమ్ ప్రాంతాల్లో పౌరులను బందీలుగా తీసుకున్నట్టు సమాచారం.కొందరు సైనికాధికారులు కూడా వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. మిలిటెంట్లు, చొరబాటుదారులను ఏరివేస్తూనే.. ఆ ప్రాంతాలను విముక్తం చేయడమే ఇజ్రాయెల్ సైన్యం ప్రథమ ప్రాధాన్యం.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×