Sankranthiki Vasthunam Trailer: విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాన్నీ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ముచ్చటగా మూడోసారి ఈ కాంబో నుంచి వస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్స్ అయిన విషయం కూడా విదితమే. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి హైప్ పెంచేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఒకప్పుడు వెంకీ మామ తన కామెడీ టైమింగ్ తో ఎలా అయితే అలరించాడో.. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలానే అలరించబోతున్నాడని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.
Anchor Syamala: పవన్ కళ్యాణ్ నీతులే చెప్తాడు.. మళ్లీ కెలికిన యాంకర్ శ్యామల
శ్రీనివాస్ అవసరాలను కొంతమంది కిడ్నాప్ చేయడంతో ట్రైలర్ మొదలయ్యింది. ” ఈ కిడ్నాప్ విషయం బయటకు తెలిస్తే అరనిమిషంలో మన ప్రభుత్వం కూలిపోతుంది” అని నరేష్ చెప్పడం చూపించారు. ఇక ఆ కిడ్నాప్ ను ఛేదించాడని ఒక సిన్సియర్ ఆఫీసర్ కోసం చూస్తుండగా.. ఎక్స్ కాప్ గా ఉన్న వెంకీకి ఆ మిషన్ అప్పజెప్తారు. అతని దగ్గరకు వెంకీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి వస్తుంది. అప్పటికే ఐశ్వర్య రాజేష్ ను పెళ్ళాడి .. ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన వెంకీ.. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ను చూసి ఇంకోసారి ప్రేమలో పడతాడు.
ఇక వీరి ప్రేమ కథ తెలుసుకున్న భార్య ఐశ్వర్య.. ఆ మిషన్ కంప్లీట్ చేయడానికి తాను కూడా వస్తానని చెప్పుకొస్తుంది. దీంతో చేసేదేమి లేక వెంకీ.. ఎక్స్ లెంట్ వైఫ్ ను, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని మిషన్ ఫినిష్ చేయడానికి బయల్దేరతాడు. మధ్యలో వీరి మధ్య జరిగిన గిల్లికజ్జాలు ఏంటి.. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఇరుక్కొని వెంకీ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు.. ? అసలు శ్రీనివాస్ అవసరాలను ఎందుకు కిడ్నాప్ చేశారు.. ? ఎవరుచేశారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Urvashi Rautela : దబిడి డబిడి సాంగ్ కు హాట్ బ్యూటీ రెమ్యునరేషన్.. మాస్ సాంగ్ కు కోట్లు?
ట్రైలర్ మొత్తాన్ని అనిల్ రావిపూడి ఫన్ తో నింపేశాడు. ట్రైలర్ ను చూస్తుంటే.. వింటేజ్ వెంకటేష్ గుర్తు రాక మానడు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక చివర్లో ” హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో ప్రతిసారి విక్టరీనే” అని సింబాలిక్ డైలాగ్ ను చెప్పి సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరి ఈ సంక్రాంతికి మిగతా సినిమాలను పక్కకు నెట్టి.. సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.