BigTV English

Smart Trolley : శంషాబాద్‌లో స్మార్ట్ ట్రాలీ.. దేశంలో తొలిసారి

Smart Trolley : శంషాబాద్‌లో స్మార్ట్ ట్రాలీ.. దేశంలో తొలిసారి
smart trolley

smart trolley : ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత స్మార్ట్ బ్యాగేజి ట్రాలీలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ తరహా టెక్నాలజీని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ డిజిటలీకరణలో ఇది మరో కీలక ముందడుగుగా చెప్పొచ్చు.


డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఈ-బోర్డింగ్, ఫేస్ రికగ్నిషన్ వంటి అధునాతన వ్యవస్థలను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ప్రపంచంలో స్మార్ట్‌ బ్యాగేజి ట్రాలీ సదుపాయాన్ని తొలిసారిగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టులో తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఎయిర్‌పోర్ట్ మనదే.

ఎయిర్‌పోర్ట్ బ్యాగేజి ట్రాలీల కోసం లాంగ్ రేంజ్(LoRa) ఐవోటీ ప్లాట్‌ఫాంను జీఎంఆర్ ఏర్పాటు చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా దాదాపు 3 వేల బ్యాగేజి ట్రాలీలను అనుసంధానించిన క్రమంలో.. ప్రయాణికుల వెయిటింగ్ టైం గణనీయంగా తగ్గుతుంది.


ఎయిర్ పోర్టుల్లో ట్రాలీ మేనేజ్‌మెంట్ అనేది డైనమిక్ ప్రాసెస్. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రమాణాల మేరకు 10 లక్షల మంది ప్రయాణికులకు కనీసం 160 ట్రాలీలు అందుబాటులో ఉండాలి. ఒక్క శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లోనే 3 వేల ట్రాలీలు ఉన్నాయి.

వచ్చే, పోయే ప్రయాణికులకు వీటిని అందుబాటులో ఉంచడంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఎంతగానో శ్రమిస్తుంటారు. ఇందులో ఎదురయ్యే సవాళ్లను ఐవోటీ ఆధారిత స్మార్ట్ ట్రాలీ మేనేజ్‌మెంట్ ద్వారా అధిగమించే వీలుంది. ఎయిర్‌పోర్ట్‌లో ట్రాలీలు ఏ మూలన ఉన్నా గుర్తించి ఒక చోటుకి చేర్చడం ఈ టెక్నాలజీతో సులభతరం కాగలదు.

స్మార్ట్ ట్రాలీ వ్యవస్థ యూజర్ ఫ్రెండ్లీ. మొబైల్, డెస్క్ టాప్, లాప్‌టాప్‌పైనా ఇది పనిచేస్తుంది. నో-జోన్ ఏరియాలోకి ట్రాలీలను తీసుకెళ్తే.. మనల్ని అప్రమత్తం చేసేలా ఇన్-బిల్ట్ అలర్ట్ మెకానిజం ఇందులో ఏర్పాటు చేశారు. నో-జోన్‌లోకి ట్రాలీ ప్రవేశించగానే.. వెంటనే మెసేజ్ వస్తుంది.

విమానం ఆలస్యం ఉందా? లేదా? అనే సమాచారాన్ని రియల్‌టైమ్‌లో తెలుసుకోవడం దీని ద్వారా సాధ్యమవుతుంది. ట్రాలీపై ఉన్న డ్యాష్ బోర్డులో ఆ వివరాలు వస్తాయి. మన బోర్డింగ్ పాస్ వివరాలను ఎంటర్ చేస్తే చాలు.. ఫ్లైట్ టైమింగ్స్‌తో పాటు గేట్ నంబర్ వివరాలు వెంటనే ఆ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. గేట్ వద్దకు చేరుకొనే మార్గాన్ని కూడా అదే చూపుతుంది.

బోర్డింగ్‌‌కు వ్యవధి ఉంటే షాపింగ్ చేసుకొనేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ ఏ షాపులు.. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆయా షాపులు అందజేస్తున్న ఆఫర్ల ఏమిటి? అన్న వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే వాష్‌రూంలు, రెస్టారెంట్ల గురించి సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుంది.

Related News

UP News: విద్యా అధికారిపై కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Big Stories

×