BigTV English
Advertisement

Hyderabad: వరుస నేరాలు.. క్రైమ్ కేపిటల్‌గా హైదరాబాద్..

Hyderabad: వరుస నేరాలు.. క్రైమ్ కేపిటల్‌గా హైదరాబాద్..


Hyderabad: వరుస నేరాలు.. క్రైమ్ కేపిటల్‌గా హైదరాబాద్.. హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయ్‌. పాతబస్తీ, మైలార్‌దేవ్‌పల్లిలో డబుల్‌ మర్డర్లు జరిగాయ్‌. ఒకే రోజులో ఏకంగా నలుగురు హత్యకు గురయ్యారు. మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌ చౌరస్తా సమీపంలోని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. బండరాళ్ల మోది హత్య చేశారు దుండగులు. రెండు రోజుల క్రితం కూడ నేతాజీనగర్‌లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. మరి పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్‌ చేస్తుంది ఎవరు? వారిని ఎందుకు ఇంత క్రూరంగా చంపుతున్నారు? ఇది ఎవరి పని? వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

మరోవైపు పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. బండరాళ్లతో మోది, కత్తులతో పొడిచి అతి కిరాతకంగా మర్డర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు యూసుఫ్ అలియాస్ డాలి, రియాజ్ అలియాస్ సోఫియాగా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. మర్డర్ స్పాట్‌లో కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీసీ కిరణ్‌ తెలిపారు. హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు డీసీపీ.


మాట్లాడుకుందామని పిలిచి ప్రియురాలిని చంపే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. హైదరాబాద్‌లోని నార్సింగిలో ఈ దారుణం జరిగింది. ప్రియురాలిని కత్తి తో పొడిచాడు ప్రేమికుడు. ఈఘటనలో యువతి మెడ, చేతులకి తీవ్రగాయాలయ్యాయి. బాధిత యువతి ఏపీలోని పిడుగురాళ్లకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడిచేసిన నిందితుడిని గచ్చిబౌలికి చెందిన గణేష్‌ గా పోలీసులు గుర్తించారు. యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. యువకుడు జొమాటోలో పని చేస్తున్నాడు. రోజు ఉద్యోగం తరువాత ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. వారిమధ్య వాగ్వివాదం జరగడంతో కత్తితో మెడపై దాడి చేశాడు యువకుడు. నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×