E-Paper
Advertisement

నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్

నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్
Advertisement

Switzerland Bunkers Billionaires| వందల, వేల కోట్లు ఉన్న సంపన్నులకు, నల్లధనం కలిగిన ఆర్థిక మోసగాళ్లకు ప్రపంచంలోనే ఇష్టమైన దేశం స్విట్జర్లాండ్‌. ఎందుకంటే ఇక్కడి బ్యాంకులు వారి ధనాన్ని దాచిపెట్టి ఏ దేశ ప్రభుత్వం ఆరా తీసినా వివరాలు చెప్పవు. అలాంటిది ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో సంపన్నులు తమ విలువైన వస్తువులను అత్యంత సురక్షితంగా దాచుకునేందుకు ప్రత్యేక బంకర్లు (భూగర్భ వాల్ట్‌లు) నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లుంగెర్న్ సమీపంలోని బ్రునిగ్ పర్వత ప్రాంతం కింద నిర్మితమవుతోంది. భూమికి 100 మీటర్లకు పైగా లోతులో సుమారు 20 నుంచి 24 ప్రైవేట్ భూగర్భ గదులను ఏర్పాటు చేయనున్నారు. ఇదంతా ఒక ప్రైవేట్ కంపెనీ కొత్త ప్రారంభించిన బిజినెస్. స్విస్ వ్యాపారవేత్త థామస్ గేజర్ నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

ఒక్క వాల్ట్ ధర రూ.5.8 కోట్ల నుంచి ప్రారంభం

ఈ భూగర్భ గదులను 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ఒక్కో వాల్ట్ ధర సుమారు 5 లక్షల స్విస్ ఫ్రాంకుల నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.5.8 కోట్లు. పెద్ద పరిమాణంలో ఉండే వాల్ట్‌ల ధర దాదాపు 10 లక్షల స్విస్ ఫ్రాంకుల వరకు ఉండవచ్చు. అంటే దాదాపు 11.78 కోట్లు

బంగారం, కళాఖండాలు, లగ్జరీ వస్తువులు..

Advertisement

బంగారం, ఖరీదైన కళాఖండాలు, లగ్జరీ వస్తువులు, పాతకాలపు కార్లు, వైన్ (ఖరీదైన రకం) వంటి విలువైన వస్తువులను ఇక్కడ భద్రపరుచుకోవచ్చు. భూగర్భ ప్రాంతంలో సహజంగా సుమారు 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండటం వల్ల వైన్, కళాఖండాలు వంటి సున్నితమైన వస్తువులకు అనుకూలంగా ఉంటుంది.

అత్యవసర పరిస్థితుల్లో నివసించే అవకాశం కూడా

ఈ ప్రాజెక్ట్ కేవలం నిల్వ కోసం మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక ఆశ్రయంగా కూడా ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. భూగర్భంలో మాడ్యులర్ లివింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్తులో ఇవి ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు ఏర్పడినప్పుడు ప్రైవేట్ రిట్రీట్‌లుగా ఉపయోగపడవచ్చు. ఉదాహరణకు ఒక దేశం నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు.

భద్రతకు ప్రాధాన్యం

Advertisement

వాల్ట్‌లకు చేరుకోవడానికి కఠినమైన భద్రతా తనిఖీలు, గార్డెడ్ ఎంట్రన్స్ ఉంటాయి. ట్రక్కులు నేరుగా భూగర్భ సొరంగాల ద్వారా ప్రైవేట్ వాల్ట్‌ల వరకు వెళ్లేలా సదుపాయం కల్పించనున్నారు. భద్రతా వ్యవస్థ స్విస్ నేషనల్ బ్యాంక్‌లో ఉపయోగించే విధానాలను పోలి ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన చరిత్ర

ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రాంతంలో గతంలో కాంటినా కావెర్నా అనే రెస్టారెంట్, ఈవెంట్స్ వేదిక ఉండేది. అక్కడ షూటింగ్ రేంజ్‌తో పాటు అగ్నిమాపక సిబ్బంది శిక్షణ కేంద్రం కూడా ఉండేది. కొత్త ప్రాజెక్టుపై స్థానికుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.

Also Read: బ్యాంక్ లాకర్‌ నుంచి రూ.50 లక్షల నగలు చోరీ.. చేతులెత్తేసిన బ్యాంక్.. నష్టపరిహారం ఎవరిస్తారు?

స్విట్జర్లాండ్ భూగర్భ భద్రతా సంప్రదాయానికి కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్

స్విట్జర్లాండ్‌లో పర్వతాల మధ్య భూగర్భ బంకర్లను భద్రత కోసం ఉపయోగించే సంప్రదాయం చాలా కాలంగా ఉంది. పాత సైనిక బంకర్లలో కొన్ని ఇప్పుడు స్టోరేజ్, డేటా సెంటర్లుగా ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దొంగతనాలు మరియు ఇతర ప్రమాదాల నేపథ్యంలో సంపన్నుల నుంచి సురక్షిత నిల్వకు డిమాండ్ పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.

భవిష్యత్తులో భద్రతా శిక్షణ, రిస్క్ విశ్లేషణ, సర్వైవల్ సదుపాయాలను కూడా అందించాలని కంపెనీ యోచిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ సాధారణ భూగర్భ వాల్ట్‌లను దాటి సంపన్నుల కోసం ప్రత్యేకమైన ప్రైవేట్ భద్రతా నెట్‌వర్క్‌గా మారే అవకాశం ఉంది.

Also Read: పార్ట్ టైమ్ బిజినెస్‌తో నెలకు రూ.30 లక్షల ఆదాయం.. కేవలం రూ.19000 పెట్టుబడి

Related News

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

Big Stories

Advertisement
×