E-Paper
Advertisement

Punjab: ‘ఆర్ఆర్ఆర్’ సీన్ రిపీట్.. తుపాకులు, కత్తులతో పోలీస్ స్టేషన్‌పై దాడి

Punjab: ‘ఆర్ఆర్ఆర్’ సీన్ రిపీట్.. తుపాకులు, కత్తులతో పోలీస్ స్టేషన్‌పై దాడి
Advertisement

Punjab: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో వందలాది మంది రైతులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తారు. కర్రలు, ఆయుధాలు పట్టుకొని పోలీసులపై దాడికి యత్నిస్తారు. సేమ్ టూ సేమ్ ఇటువంటి ఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై వందలాది మంది కత్తులు, తుపాకులతో దాడి చేశారు. పోలీసులు తమ నేతను అరెస్ట్ చేయడంతో ఆందోళన నిర్వహించారు.

వారిస్ పంజాబ్ దే మత సంస్థ చీఫ్ అమత్ పాల్ సింగ్ సన్నహితుడు లవ్ ప్రీత్ తుఫాన్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. దీంతో అమృత్ పాల్ సింగ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కత్తులు, తుపాకులతో దాడి చేశారు. పెద్ద ఎత్తున స్పీకర్లు పెట్టి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కుట్రతోనే లవ్ ప్రీత్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.

Advertisement

పోలీసులు వారిని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ తోసుకుంటూ ముందుకెళ్లడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో అధికారులు దిగొచ్చారు. లవ్‌ప్రీత్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×