BigTV English

Fingertip:వేలి స్పర్శతో దానిని కనిపెట్టవచ్చు..

Fingertip:వేలి స్పర్శతో దానిని కనిపెట్టవచ్చు..

Fingertip:ప్రస్తుతం గాలిలో కలిసే ప్రతీది కాలుష్యానికి కారణమవుతోంది. వీటన్నింటిని ఒకేసారి అరికట్టడం కష్టమని ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు. అందుకే అన్నింటిని ఒకేసారి ఆపలేకపోయినా.. కనీసం అదుపు చేయాలని భావనలో వారు ఉన్నారు. అయితే గాలిలో కాలుష్యం శాతం పెరగడానికి మెర్క్యూరీ కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఈ మెర్క్యూరీని సులభంగా గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఓ కొత్త మార్గాన్ని కనుగొన్నారు.


మెర్క్యూరీ అనేది కేవలం గాలి కాలుష్యానికి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో విధాలుగా కూడా మనిషి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మెర్క్యూరీతో పాటు లీడ్ కూడా హాని కలిగించే పదార్థాల్లో ఒకటిగా మారిపోయింది. మెర్క్యూరీ, లీడ్‌ను ఎంత గాలిలో కలవకుండా ఉంచడానికి ప్రయత్నించినా.. ఆ ప్రయత్నాలు అన్ని పూర్తిగా సక్సెస్ కావడం లేదు. ఎందుకంటే వీటిని గుర్తించడం శాస్త్రవేత్తలకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కేవలం వేలి స్పర్శతో వాటిని కనుక్కునేలా ఒక కొత్త టెక్నాలజీని డిజైన్ చేశారు.

వేలి స్పర్శతో తక్కువ మోతాదులో ఉన్న మెర్క్యూరీని కనిపెట్టడానికి ఒక కృత్రిమ చేతిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది మెర్క్యూరీని కనిపెట్టి వెంటనే వారికి తెలియజేస్తుంది. ఈ చేయి ఒక నానోసెన్సార్‌తో తయారు చేయబడిందని వారు తెలిపారు. మెర్క్యూరీ అనేది గాలిలో కనుక్కోవడం ఎంత కష్టమో.. ఆహారంలో, నీటిలో కూడా కనుక్కోవడం అంతే కష్టం. తెలియకుండా ఆ ఆహారాన్ని కానీ, నీటిని కానీ తీసుకుంటే అది ఎన్నో విధాలుగా మనిషి ఆరోగ్యానికి హాని చేస్తుంది.


అందుకే ప్రతీచోట మెర్క్యూరీని కనిపెట్టడానికి ఎన్నో విధమైన సెన్సార్లను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అందులో ఒకటే ఈ నానోసెన్సార్. ఇప్పటివరకు వారు తయారు చేసిన ఇతర సెన్సార్ల కంటే నానోసెన్సార్ మరింత మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి కరెంటుతో పనిచేస్తాయి కాబట్టి వీటిని ట్రైబోఎలక్ట్రిక్ నానోసెన్సార్స్ (టెన్స్) అని కూడా అంటారని వారు తెలిపారు. ఇప్పటికే టెన్స్‌తో వారు చేసిన పరిశోధనలు విజయవంతం అయ్యాయని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.

PCR Test:ర్యాపిక్ టెస్ట్‌కంటే వేగంగా పీసీఆర్ రిజల్ట్..

Webb Telescope: 700 మిలియన్ ఏళ్లనాటి గ్యాలక్సీలను కనుగొన్న టెలిస్కోప్..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×