BigTV English

Summer Kitchen Tips: ఉక్కపోత వల్ల కిచెన్‌లో.. వంట చేయడానికి ఇబ్బంది పడుతున్నారా ?

Summer Kitchen Tips: ఉక్కపోత వల్ల కిచెన్‌లో.. వంట చేయడానికి ఇబ్బంది పడుతున్నారా ?

Summer Kitchen Tips: ఎండాకాలంలో ఇంట్లోని ఉష్ణోగ్రతకు తట్టుకోలేకపోతుంటాం. అలాంటిది కిచెన్ లో వంట చేయడం అంటే సవాల్ అనే చెప్పొచ్చు. కొన్ని సార్లు వంటగది నిప్పుల కొలిమిలాగా అనిపిస్తుంటుంది. సమ్మర్ లో గ్యాస్ వేడితో పాటు ఆవిరి ద్వారా వచ్చే సెగ ఈ సమస్యను మరింత పెంచుతుంది. ఇలాంటి సమయంలో వంట చేయడం ఇబ్బందిగా మారుతుంది. అందుకే కొన్ని రకాల టిప్స్ పాటించి వంటగదిని చల్లగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా వంట చేసేటప్పుడు చెమటలు పట్టడం, చిరాకు అలసట నుండి కూడా బయటపడవచ్చు.


వంటగదిని చల్లగా ఉంచే టిప్స్:
సమ్మర్‌లో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం పూట వంట చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఈ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటమే కాకుండా వంటగదిలో పనిచేసేటప్పుడు అలసట కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. రోజులో ఎక్కువగా వేడిగా ఉన్న సమయంలో వంటగదికి దూరంగా ఉండటం మంచిది.

కిటికీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్‌లో ఉంచండి:
మీ వంటగదికి కిటికీలు లేదా వెంటిలేషన్ ఉంటే.. వంట చేసేటప్పుడు వాటిని తెరిచి ఉంచండి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వేడి గాలి, ఆవిరిని బయటకు పంపి.. వంటగది ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోతే.. ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ కూడా వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.


త్వరగా పూర్తయ్యే ఆహారాన్ని వండండి:
వేసవిలో.. త్వరగా వండగలిగే, ఎక్కువ గ్యాస్ లేదా నూనె ఉపయోగించని ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉడకబెట్టడం, ఆవిరి చేయడం లేదా గ్రిల్ చేయడం ద్వారా తయారుచేసిన వంటకాలు త్వరగా తయారవడమే కాకుండా త్వరగా జీర్ణం అవుతాయి. అంతే కాకుండా తక్కువ సమయంలో తయారు చేసే పప్పు, ఉప్మా, పోహా లేదా సలాడ్ వంటి వాటిని వండండి.

విద్యుత్ ఉపకరణాలను వాడండి:
వేసవిలో గ్యాస్ స్టవ్ కు బదులుగా, మైక్రోవేవ్, ఇండక్షన్ లేదా ఎయిర్ ఫ్రైయర్ వంటి వాటిని ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఉపకరణాలు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. అంతే కాకుండా ఆహారం కూడా వీటిపై త్వరగా తయారు చేయవచ్చు. అలాగే.. కరెంట్ వినియోగం కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మీ వంటగది వేడెక్కదు.అంతే కాకుండా మీ సమయం కూడా ఆదా అవుతుంది.

వేడి పాత్రలను వెంటనే బయట పెట్టండి:
వంట చేసిన తర్వాత వేడి పాత్రలను వంటగదిలో ఎక్కువసేపు ఉంచకూడదు. వండిన పాత్రలు వంటగదిలోనే ఉంచితే ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. అందుకే పాత్రలను వెంటనే సింక్‌లో వేసి చల్లటి నీటితో కడగాలి లేదా కిచెన్ బయటి ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల వంటగది అంత వేడిగా ఉండదు. అంతే కాకుండా గది వాతావరణం కూడా తాజాగా ఉంటుంది.

Also Read: రాగి బాటిల్‌లోని.. నీళ్లు తాగుతున్నారా ? డేంజర్‌లో పడ్డట్లే !

త్రాగునీరు, చల్లని వస్తువులు దగ్గరగా ఉంచుకోండి:
వంటగదిలో పనిచేసేటప్పుడు తరచుగా బయటకు వెళ్లకుండా ఉండటానికి మీకు దగ్గరలోనే వాటర్ బాటిల్, మజ్జిగ లేదా నిమ్మరసం ఉంచుకోండి. ఇది డీ హైడ్రేషన్‌ను నివారిస్తుంది. అంతే కాకుండా మీరు తరచుగా విరామం తీసుకోవలసిన అవసరం కూడా ఉండదు. అలాగే.. వంటగదిలో చిన్న ఫ్యాన్ లేదా కూలర్ ఉంచడం కూడా వల్ల కూడా గది చల్లగా ఉంటుంది. వెంటిలేషన్ సరిగా లేనప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×