BigTV English

India-Pakistan War 2025: ప్రధాని- ఆర్మీ చీఫ్ ఇళ్లకు సమీపంలో పేలుళ్లు.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు!

India-Pakistan War 2025: ప్రధాని- ఆర్మీ చీఫ్ ఇళ్లకు సమీపంలో పేలుళ్లు.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు!

India-Pakistan War 2025: భారత్ సైన్యం ధాటికి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కవ్వింపు చర్యలకు పాల్పడి భారీ మూల్యం చెల్లించుకుంటోంది దాయాది దేశం. తాజాగా ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, అలాగే ఆర్మీ చీఫ్ మునీర్ ఇంటికి సమీపంలో భారీ పేలుళ్లు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పేలుళ్లపై ఆదేశం ఇంకా స్పందించాల్సి వుంది.


పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి దిగిన వేళ భారత సైన్యం ధీటుగా సమధానం ఇస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంది. ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ నివాసానికి అత్యంత సమీపంలో పేలుడు జరిగినట్టు సమాచారం. ప్రధాని ఇంటికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇంటి సమీపంలో పేలుళ్లు


వెంటనే అలర్టయిన ప్రధాని షరీఫ్ వ్యక్తిగత సిబ్బంది, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సురక్షితంగా ఉండేందుకు బంకర్‌లోకి పంపినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాల్సివుంది. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇంటి సమీపంలో పేలుడు సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆదేశ సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.

పహల్‌గామ్ ఉగ్ర దాడి ఆ దేశ ఆర్మీ చీఫ్ కనిపించలేదు. మొదట్లో భారత్ పై చిందులేసిన ఆయన, ఆ తర్వాత విదేశాలకు పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే లండన్, లేదంటే అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్లినట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ కనీసం ఆయన మచ్చుకైనా కనిపించలేదు. తాజాగా మునీర్ ఇంటికి సమీపంలో పేలుడు జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.

ALSO READ: ఇండియాలోని ఆ 15 ప్రాంతాలపై పాకిస్తాన్ గురి?

భారత్ పైకి దూసుకొస్తున్న పాకిస్తాన్ హైటెక్ ఫైటర్ జెట్‌లు F-16, JF 17లతోపాటు మూడు ఫైటర్ జెట్‌లను సైన్యం కూల్చివేసింది. గురువారం భారత బలగాలు ఇద్దరు పాకిస్తాన్ ఫైటర్ జెట్ పైలట్లను సజీవంగా పట్టుకున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఒక పైలట్‌ను పట్టుకోగా మరొకర్ని జమ్మూ జిల్లాలోని అఖ్నూర్‌లో పట్టుకున్నారు.

పాక్ యుద్ధ విమానాలు కూల్చివేత

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత్. దాడులతో రగిలిపోతున్న పాకిస్థాన్, దేశంలోని 15 నగరాలను టార్గెట్ చేసింది. ఆపై క్షిపణులను మోహరించింది. భారత్ గగనతల రక్షణ వ్యవస్థతో ఆయా దాడులను తిప్పికొట్టింది. గురువారం రాత్రి పాక్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, యుద్దవిమానాలను భారత్ సైన్యం కూల్చేసింది.

జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ సైన్యం దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతోంది భారత్. పౌరులు లక్ష్యంగా చేసుకుని పాక్ దాడి మొదలుపెట్టింది. దాయాది కుట్రలను ఆర్మీ ఆదిలో అడ్డుకుంది. ఉద్రిక్తంగా ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గురువారం రాత్రి నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 50 డ్రోన్లను కూల్చివేసింది భారత సైన్యం. వాటిలో ఉధంపూర్, సాంబ, జమ్మూ సెక్టర్‌లో ఎక్కువగా డ్రోన్లను కూల్చినట్టు తెలిపింది.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×