మరోవైపు ఇండియా పాకిస్థాన్ ఉధ్రిక్తతల మధ్య ఇప్పటి వరకు భారత వైమానిక దళం మాత్రమే పోరాడింది. కాగా ఇప్పుడు నేవీ కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌక విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. ఇండియన్ నేవీ దాడులతో కరాచీ ఓడరేవుతో పాటూ నగరం అంతా బాంబుల మోత మోగించింది. రక్షణశాఖ శాఖ సమాచారం ప్రకారం..పాకిస్థాన్ లోని కరాచీ, ఒర్మారా ఓడరేవుల వద్ద విక్రాంత్ అనేక క్షిపణులను ప్రయోగించింది.
కరాచీలోని రెండు ప్రధాన ప్రాంతాల్లో దాడులకు పాల్పడగా ఓడరేవు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనతో తీరప్రాంతాల నుండి పారిపోతున్నట్టు సమాచారం. కరాచీ, ఒర్మారా పాకిస్థాన్ నేవీకి కీలకమైన స్థావరాలు. వీటిలో సీనియర్ అధికారుల కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. వీటిని నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ నేవీని చావు దెబ్బ కొట్టింది.
Also Read: మోదీ యుద్ధ వ్యూహం.. ఆపరేషన్ టెర్రర్ హంట్
NS విక్రాంత్ యుద్ధవాహక అనేక విశేషాలను కలిగి ఉంది. దాని బరువు 45 వేల మెట్రిక్ టన్నులు. పొడవు 262 మీటర్లు. దానిపై ఒకేసారి 30 మిగ్ 29K యుద్ధవిమానాలను నిలుపవచ్చు. ఒక్కో మిగ్ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కామోవ్-31 హెలికాప్టర్లను, యాంటీ సబ్‌మెరైన్ మిషన్ కోసం వాడే హాల్ ధ్రువ్ హెలికాప్టర్లను INS విక్రాంత్ మీద మోహరిస్తారు. ఇక విక్రాంత్ రక్షణ కోసం దానిపై ఉపరితలం నుంచి గగన తలానికి దూసుకెళ్లే బరాక్-8 క్షిపణులు ఉంటాయి. INS విక్రాంత్‌ను శత్రు దుర్భేద్యంగా మార్చే కారియర్ బాటిల్ గ్రూప్ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్‌లో కల్వరి క్లాస్ జలాంతర్గాములు, కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్లు, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు ఉంటాయి. వీటన్నింటితో ఐఎన్‌ఎస్ విక్రాంత్.. సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు దూసుకువెళ్లగలుగుతుంది.