India Post Driver Job| ఇండియా పోస్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. పోస్టల్ శాఖ మెయిల్ మోటార్ సర్వీస్ (ఎంఎంఎస్) పరిధిలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు డిప్యుటేషన్ లేదా అబ్జార్ప్షన్ విధానంలో జరుగనున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఉద్యోగ ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురించిన తేదీ నుంచి 60 రోజులలోపు అప్లికేషన్ సమర్పించాలి.
ఈ నియామక ప్రక్రియలో మొత్తం 11 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. వాటిలో 10 పోస్టులు బెంగళూరులోని మెయిల్ మోటార్ సర్వీస్ కార్యాలయంలో ఉన్నాయి. మరో ఒక పోస్టు మైసూరులోని సబ్ డిపోకు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులు భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ఏడవ కేంద్ర వేతన సంఘం (7వ సీపీసీ) ప్రకారం పే లెవల్ – 2 కింద జీతం చెల్లిస్తారు. ప్రాథమిక వేతనం నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ రెండింటికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
కనీసం మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి. వాహనాల చిన్నపాటి మరమ్మతులు చేయగలిగే ప్రాథమిక పరిజ్ఞానం కూడా ఉండాలి.
ఈ నియామకాలు ప్రస్తుతం పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. డిప్యుటేషన్ లేదా అబ్జార్ప్షన్ విధానంలో నియామకాలు చేపడతారు. పోస్టల్ శాఖలో పనిచేస్తున్న డిస్పాచ్ రైడర్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంఎటీఎస్) అర్హతలు ఉంటే వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. తగిన అభ్యర్థులు శాఖలో అందుబాటులో లేకపోతే ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తుల చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు మించకూడదు. ఒక సంవత్సరంలో పదవీ విరమణ చేయబోయే లేదా రిజర్వ్ విభాగానికి బదిలీ కానున్న సాయుధ దళాల సిబ్బంది కూడా అర్హత నిబంధనలు పూర్తి చేస్తే దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు
అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి సమర్పించాలి. దరఖాస్తుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, వయస్సు ధృవీకరణ పత్రం, నియామక ఉత్తర్వు తదితర అవసరమైన పత్రాల స్వీయ ధృవీకరించిన ప్రతులను జతచేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు — 560001 చిరునామాకు పంపాలి.
Also Read: బాయ్ ఫ్రెండ్ అద్దెకు లభించును.. కొత్త ట్రెండ్ బాస్.. గంటకు రెంట్ ఎంతంటే?
దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవడం మంచిది. అవసరమైన అన్ని పత్రాలను సరిగా చెక్ చేసుకొని జతచేయాలి. అసంపూర్ణ దరఖాస్తులను అధికారులు తిరస్కరించే అవకాశం ఉంది. చివరి తేదీకి ముందే దరఖాస్తు పంపితే అనవసర ఆలస్యాలు నివారించవచ్చు.