E-Paper
Advertisement

ఉద్యోగాలు ఫుల్ చేసేవారు నిల్.. లక్షల్లో జీతం, మీరు చేస్తారా?

ఉద్యోగాలు ఫుల్ చేసేవారు నిల్.. లక్షల్లో జీతం, మీరు చేస్తారా?
Advertisement

High Paying Jobs| ఇటీవల రెడిట్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎక్కువ జీతం ఉన్నప్పటికీ చాలా మంది దరఖాస్తు చేయడానికి ఇష్టపడని ఉద్యోగాలు ఏవి? అని ఒక యూజర్ ప్రశ్నించాడు. దీనికి చాలా మంది తమ అభిప్రాయాలు షేర్ చేశారు. మంచి ఆదాయం ఉన్నా కఠినమైన పరిస్థితుల్లో చేయాల్సిన ఉద్యోగాలను సూచించారు. ఈ ఉద్యోగాలకు శారీరక శ్రమ, మానసిక ధైర్యం లేదా ప్రత్యేక నైపుణ్యాలు అవసరమని చాలామంది అభిప్రాయపడ్డారు.

నైపుణ్యం ఉన్న ట్రేడ్ ఉద్యోగాలకు మంచి ఆదాయం

ఈ చర్చలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. ఒక వినియోగదారుడు తాను ఆఫీస్ ఉద్యోగాన్ని వదిలి ఎలక్ట్రీషియన్‌గా మారినట్లు చెప్పాడు. ఈ పని తనకు ఎక్కువ సంతృప్తి ఇస్తోందని తెలిపారు. అయితే వేసవిలో మాత్రం ఆఫీసులో హాయిగా ఏసీ వేసుకొని చేసే జాబ్ చేయాలనిపిస్తోందని తెలిపాడు. కష్టమైన వాతావరణంలో పనిచేయాల్సి వచ్చినా మంచి ఆదాయం లభిస్తుందని వివరించారు.

ప్లంబింగ్ ఉద్యోగంపై భిన్న అభిప్రాయాలు

Advertisement

కొంతమంది ప్లంబింగ్ మంచి ఆదాయం ఇచ్చే వృత్తి అని చెప్పారు. అయితే మరికొందరు దీనిపై భిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంతంగా వ్యాపారం నిర్వహించే ప్లంబర్లు ఎక్కువ సంపాదిస్తారని వారు చెప్పారు. పెద్ద కంపెనీల్లో ఉద్యోగులుగా పనిచేసేవారికి కూడా అంత ఆదాయం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రమాదకర ఉద్యోగాలకు ఎక్కువ వేతనం

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అండర్‌వాటర్ వెల్డర్, కరెక్షనల్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్, మర్చంట్ మెరైన్ వంటి ఉద్యోగాల గురించి చర్చలో పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. అలాగే విండ్ టర్బైన్ టెక్నీషియన్, లైట్‌హౌస్ కీపర్ ఉద్యోగాలకు కూడా మంచి జీతం లభిస్తుందని రెడ్డిట్ యూజర్లు పేర్కొన్నారు. అయితే ఈ ఉద్యోగాల్లో ప్రమాదాలు, ఒత్తిడి, ఎక్కువ బాధ్యతలు సాధారణమని చెప్పారు.

శారీరకంగా కష్టమైన ఉద్యోగాలు

Advertisement

కొన్ని ఉద్యోగాల్లో ఎక్కువ శారీరక శ్రమ అవసరమవుతుంది. విండ్ టర్బైన్ టెక్నీషియన్లు ఎత్తైన టర్బైన్‌లపైకి ఎక్కి మరమ్మతులు చేయాలి. మర్చంట్ మెరైన్ ఉద్యోగులు కుటుంబానికి దూరంగా ఎక్కువ రోజులు గడపాల్సి ఉంటుంది. మిలిటరీ అధికారులపై కూడా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అందుకే ఈ ఉద్యోగాలను ఎంచుకునే వారు తక్కువగా ఉంటారు.

ఈ ఉద్యోగాలు కూడా స్పెషల్

కొంతమంది మోర్ట్యువరీ సర్వీస్, బయోహాజర్డ్ క్లీనప్ వంటి ఉద్యోగాలను కూడా సూచించారు. ఈ రంగాల్లో యువత అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ పనులు మానసికంగా కఠినంగా ఉన్నప్పటికీ స్థిరమైన ఆదాయాన్ని అందించే అవకాశముందని తెలిపారు.

Also Read: భలే ఉద్యోగం.. ఆఫీస్‌లో కూర్చోవాల్సిన పనిలేదు! ప్రపంచాన్ని చుట్టేస్తూ చేయగల 9 అద్భుతమైన కెరీర్లు

ప్రస్తావనకు వచ్చిన ఇతర ఉద్యోగాలు

న్యూక్లియర్ మెయింటెనెన్స్, ఆస్బెస్టాస్ తొలగింపు, అగ్నిమాపక సిబ్బంది, రద్దీ ఆసుపత్రుల్లో నర్సులు, ప్రమాదకర ప్రాంతాల్లో సోషల్ వర్కర్లు, పవర్ లైన్ మెయింటెనెన్స్ వంటి ఉద్యోగాలను కూడా వినియోగదారులు ప్రస్తావించారు. ఈ ఉద్యోగాలు కష్టమైనవైనా మంచి వేతనాన్ని అందించే అవకాశముందని చెప్పారు.

ఎక్కువ జీతం కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే

ఈ చర్చలో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ఎక్కువ జీతం పొందే బ్లూ కాలర్ జాబ్స్‌కు సాధారణంగా ఎక్కువ కష్టం ఉంటుంది. కొన్ని ఉద్యోగాల్లో శారీరక శ్రమ అవసరం. మరికొన్నింటిలో ప్రాణాపాయం లేదా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగాన్ని ఎంచుకునే ముందు ఆదాయంతో పాటు పని స్వభావాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

Also Read: బిజినెస్‌లో మంచి లాభాలు సంపాదించే పెద్ద పెద్ద కంపెనీల విజయ రహస్యం ఇదే

గమనిక : ఈ కథనంలోని అభిప్రాయాలు రెడిట్ యూజర్స్ షేర్ చేసిన వ్యక్తిగత అనుభవాలు మాత్రమే. జీతాలు, పని పరిస్థితులు, అవకాశాలు, కంపెనీ, ప్రాంతం, అనుభవం మరియు నైపుణ్యాల ఆధారంగా మారవచ్చు.

Related News

నెలకు కేవలం రూ.610తో రూ.1 లక్ష సంపాదన.. ఎస్‌బిఐ కొత్త స్కీమ్ గురూ

ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ కొత్త అప్‌డేట్స్.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి, ప్రజల్లో టెన్షన్ మొదలు

జూలై 31 గడువు మిస్ అయినా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం ఉందా?

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం-వెండి ధరలు, మార్కెట్లో ఇవాళ మాటేంటి?

వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్లపై ప్రత్యేక పన్ను?

భలే ఉద్యోగం.. ఆఫీస్‌లో కూర్చోవాల్సిన పనిలేదు! ప్రపంచాన్ని చుట్టేస్తూ చేయగల 9 అద్భుతమైన కెరీర్లు

బిజినెస్‌లో మంచి లాభాలు సంపాదించే పెద్ద పెద్ద కంపెనీల విజయ రహస్యం ఇదే

Big Stories

Advertisement
×