E-Paper
Advertisement

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Supreme Court: క్యాన్సర్ తోపాటు ఇతర రోగాల మందులు వైద్య పరికరాల తయారీ, అమ్మకం ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా క్యాన్సర్‌ మందుల తయారీ ధరకు, వాటి ఎమ్మార్పీకి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. మందులు, వైద్య పరికరాల ధరలపై దాఖలైన పిటిషన్‌ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా క్యాన్సర్ మందు తయారీకి 3వేలు అవుతుంటే ఎమ్మార్పీని 27 వేలుగా ఎలా నిర్ణయిస్తారంటూ కేంద్రాన్ని నిలదీసింది.

మందులు, వైద్య పరికరాలను నిత్యావసర సరకులుగా పరిగణించి వాటి ధరలను నియంత్రించేందుకు సమర్థవంతమైన విధానం ఎందుకు తీసుకురావడం లేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఔషధాల ధరల విషయంలో 16 శాతం పరిమితిని (క్యాపింగ్‌) ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. క్యాన్సర్‌ మందుల ఎమ్మార్పీలు వాటి తయారీ వ్యయంతో పోలిస్తే అనేక రెట్లు అధికంగా ఉండటంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని మందుల ధరలు తయారీ ధర కంటే పది రెట్లు అధికంగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి భారీ వ్యత్యాసాలకు కారణమేంటని ప్రశ్నించింది.

Advertisement

ప్రతి మందు, ప్రతి వైద్య పరికరం ప్రజలకు అవసరమైందేనని అంటూ వాటిని డ్రగ్‌ ప్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించింది. ఔషధాల రీటైలర్‌ ధరపై 16 శాతానికి మించి లాభం ఎందుకు ఉండాలన్న అంశాన్నీ ధర్మాసనం ప్రస్తావించింది. అధిక ఎమ్మార్పీల కారణంగా ఆయుష్మాన్‌ భారత్‌ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అభిప్రాయపడింది.

Also Read: చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

Advertisement

మరోవైపు ఈ అంశంపై దాఖలైన పిటిషనర్ల వాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. ఔషధ తయారీదారులు, విక్రేతలు, ఆస్పత్రులు, రోగులు.. ఇలా అన్ని పక్షాల ప్రయోజనాలను కాపాడే మార్గాన్ని కేంద్రం కనుగొంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసులో తదుపరి విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్‌ 12కి వాయిదా వేసింది.

Also Read: జీతం ఎక్కువ ఉన్నా ధనవంతులు కాలేకపోతున్నారా? కోటీశ్వరులను చేసే.. 5 గోల్డెన్ సూత్రాలు మీకోసం!

Tags

Related News

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

Big Stories

Advertisement
×