E-Paper
Advertisement

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని
Advertisement

Hyderabad City: టెక్నాలజీ విస్తారంగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో రకరకాల మోసాలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని మోసాలు అధికారుల దృష్టికి రావడంతో హైదరాబాద్ వాటర్ జలమండలి బోర్డు అప్రమత్తమైంది. ఈ క్రమంలో నగరవాసులను హెచ్చరించింది. మోసపూరిత సందేశాలు నమ్మవద్దని, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. అసలు ఏం జరిగింది?

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్

తెలంగాణ ప్రభుత్వం అన్ని విభాగాలను టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు విషయాలు అధికారుల దృష్టికి రావడంతో నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ విషయంలో హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. వాటర్ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామంటూ మోసపూరిత సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించింది. గుర్తు తెలియని నంబర్లను సంప్రదించవద్దని, APK ఫైల్స్ డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేయవద్దు విజ్ఞప్తి చేసింది.

జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, నమ్మవద్దని సూచన

Advertisement

తప్పుడు సందేశాల విషయంలో అనుమానాలు ఉంటే ఈ నెంబర్‌ను 155313ను సంప్రదించాలని కోరింది. హైదరాబాద్ వాటర్ జలమండలి పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు వివిధ మొబైల్ నంబర్ల నుంచి వినియోగదారులకు SMS, WhatsApp ద్వారా నకిలీ సందేశాలు పంపుతున్న తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. గత నెల బిల్లు చెల్లించలేదని, మీటర్ రీడింగ్ అప్‌డేట్ కాలేదంటూ రకరకాల మెసేజ్ లు వస్తాయని తెలిపారు. వాటికి స్పందించకపోతే నీటి కనెక్షన్ తొలగిస్తామని వినియోగదారులను మోసగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొంది.

సెల్‌ఫోన్‌లో వచ్చిన సందేశాల్లో జలమండలి పేరు, లోగోను సైతం దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. అందులో పేర్కొన్న మొబైల్ నంబర్‌ను వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఆయా నెంబర్లను సంప్రదించిన వినియోగదారులకు తదుపరి ప్రక్రియ పేరుతో WhatsApp ద్వారా APK ఫైల్స్/అనధికార యాప్‌లను పంపించి వాటిని డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధంగా ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Advertisement

ALSO READ: తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఎస్ఎంఎస్-SMSలు, వాట్సాప్-WhatsApp సందేశాలు, APK ఫైల్స్ జలమండలి పేరుతో పంపినవి కావని స్పష్టంచేసింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఇటువంటి సందేశాలకు వినియోగదారులు రియాక్ట్ కావద్దని కోరింది. అదేవిధంగా OTP, UPI PIN, బ్యాంకు ఖాతా, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు వంటి సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని పేర్కొంది. జలమండలికి సంబంధించిన సమాచారం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే జలమండలి అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలని సూచన చేసింది. సేవలకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదుల కోసం జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313ను సంప్రదించాలని వినియోగదారులను కోరింది.

 

Related News

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×