Steve Smith Review before the umpire: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Australia vs Bangladesh) మధ్య తొలి టెస్ట్ ( Bangladesh tour of Australia, 2026) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టెస్ట్ లో బంగ్లాదేశ్ ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికి కూడా మ్యాచ్ బంగ్లాదేశ్ గుప్పిట్లోనే ఉంది. 70% బంగ్లాదేశ్ విజయ అవకాశాలను కలిగి ఉండగా.. ఆస్ట్రేలియా గెలవడం కేవలం 29 నుంచి 30% మాత్రమే ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ( Steve Smith) తన మాస్టర్ మైండ్ ను మరోసారి చూపించాడు. వికెట్ కీపర్ చేతిలో ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. అంపైర్ అవుట్ అయినట్లు ఫింగర్ చూపించక ముందే.. రివ్యూ కు వెళ్లి చరిత్ర సృష్టించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Australia vs Bangladesh) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ( Bangladesh tour of Australia, 2026) సందర్భంగా స్టీవ్ స్మిత్ తన మాస్టర్ మైండ్ ను చూపించాడు. ధోని కంటే ఫాస్ట్ గా రివ్యూ తీసుకొని.. అందరికీ షాక్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా అంపైర్ తన వేలు పైకెత్తక ముందే రివ్యూ తీసుకొని… సంచలనానికి తెర లేపాడు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ఎబాదత్ హొస్సేన్ ( Ebadot Hossain) వేసిన ఓ అద్భుతమైన బంతి.. స్టీవ్ స్మిత్ బ్యాట్ పక్క నుంచి వెళ్ళింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ క్యాచ్ పట్టగానే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు.
ఈ క్రమంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన ఔట్ ఇవ్వడానికి మనసులో నిర్ణయించుకొని.. తన వేలు పైకి లేపబోయాడు. అయితే అది నాటౌట్ అని గ్రహించిన స్టివ్ స్మిత్.. అదిరి కంటే ముందే రివ్యూకు వెళ్ళాడు. బ్యాట్ ను టీ షేప్ లో చూపిస్తూ రివ్యూకు వెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే రివ్యూలో స్మిత్ నాటౌట్ గా తేలింది. ఈ క్రమంలో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. దీంతో స్టివ్ స్మిత్ మాస్టర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ధోని కంటే వేగంగా రివ్యూ తీసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ విజయం దిశగా దూసుకు వెళ్తోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయగా 198 పరుగులు సాధించింది. అటు బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 426 పరుగులు సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో 161 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా.. నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంకా 67 పరుగులు వెనకబడే ఉంది. ఇప్పటి వరకు ఈ మ్యాచ్ లో మూడు రోజులు పూర్తయ్యాయి. ఈ లెక్కన బంగ్లాదేశ్ విజయం సాధించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.