E-Paper
Advertisement

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్
Advertisement

Bengaluru: దేశంలో ఐటీ నగరాల్లో ఒకటైన బెంగుళూరు సిటీలో ఊహించని ఘటన జరిగింది. సిటీ నడిబొడ్డున ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్ ఫైటింగ్ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు పంచ్‌లు విసురుతూ కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది. అసలు ఏం జరిగింది?

బెంగుళూరు సిటీ నడిబొడ్డున ఫైటింగ్, వీడియో వైరల్

ప్రాంతం.. బెంగుళూరు సిటీ నడిబొడ్డున. మధ్యాహ్నాం రోడ్లన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. HSR లేఅవుట్ ప్రాంతంలో అప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఆటో నుంచి దిగారు. ఆటో ఛార్జీ విషయంలో అమ్మాయిలకు-ఆటో డ్రైవర్‌కు తొలుత మాటల వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత ఒకరిపై మరొకరు పిడిగుద్దులు, పంచ్‌లు విసురుకున్నారు. దాదాపు ఈ ఘటన నాలుగైదు నిమిషాల సేపు జరిగింది.

ఇద్దరు అమ్మాయిలు- ఆటోడ్రైవర్ మధ్య ఫైటింగ్

Advertisement

పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడే ఉన్న మరొక అమ్మాయి జోక్యం చేసుకుంది. చివరకు ఆ గొడవను కంట్రోల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఈ ఫైటింగ్‌ను తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.  హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీసులు.. వీడియో చూసిన వెంటనే అమ్మాయిలను సంప్రదించి ఫిర్యాదు చేయమని కోరారు. అందుకు అమ్మాయిలు రావడానికి నిరాకరించారు.

ALSO READ: ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

Advertisement

గొడవ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల సమయం తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. ఈలోగా ఆటో డ్రైవర్‌ను కూడా గుర్తించారు. ఆ అమ్మాయిలు తన ఆటోను అద్దెకు తీసుకుని డబ్బుల విషయంలో గొడవపడ్డారని పోలీసులకు వివరించాడు ఆటో డ్రైవర్. ఘటన సమయంలో అమ్మాయిలు మద్యం మత్తులో ఉన్నారని, తనను దూషించారని వాపోయాడు. డబ్బు చెల్లించడానికి నిరాకరించారని చెప్పుకొచ్చాడు. తొలుత తనపై దాడి చేయగా, దానికి ప్రతీకారంగా వారిపై దాడి చేశానని చెప్పుకొచ్చాడు. అమ్మాయిలు ఫిర్యాదు చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు ఓ పోలీసు అధికారి.

 

Related News

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

Big Stories

Advertisement
×