Ramiz Raja On IND VS PAK: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు జట్లు సెమీ ఫైనల్స్ లో విజయం సాధిస్తే అక్టోబర్ మూడవ తేదీన జరిగే ఫైనల్స్ బరిలో నిలుస్తాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్స్ పై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమకు గోల్డ్ మెడల్స్ వద్దని… ఫైనల్స్ లో టీం ఇండియాను ఓడించడమే పాకిస్తాన్ లక్షమన్నారు. పగ తీర్చుకునేందుకు ఇది అసలైన సమయం… ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను కచ్చితంగా ఓడించాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు దిశా నిర్దేశం చేశారు. ఫైనల్ మ్యాచ్ రోజు అసలు వర్షం పడకూడదని అల్లాను ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. మ్యాచ్ జరగకుండా రద్దు అయితే ఇరు జట్లకు గోల్డ్ మెడల్స్ వస్తాయని… అలాంటి అవార్డులు తమకు వద్దంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు రమీజ్ రాజా.
చాలా రోజులుగా పాకిస్తాన్ జట్టును టీమిండియా ఓడుస్తూనే ఉంది. ఎలాంటి ఈవెంట్ జరిగినా కూడా టీమిండియా గెలుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా టీమిండియాను ఓడించే అద్భుతమైన అవకాశం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వచ్చిందని రమీజ్ రాజా వెల్లడించారు. జపాన్ గడ్డపై టీమిండియా పెద్దగా రాణించకపోవచ్చు అని అంచనా వేశారు. ఫ్లాట్ ట్రాక్స్ పైన టీమ్ ఇండియన్ ఆపడం ఎవరి తరం కాదని తెలిపారు. కానీ జపాన్ లో అన్ని స్పిన్ ట్రాక్స్ ఉన్నాయని గుర్తు చేశారు. ఈ స్పిన్ ట్రాక్స్ వల్ల టీమిండియా కచ్చితంగా ఇబ్బంది పడుతుందని.. దాన్ని పాకిస్తాన్ క్రికెటర్లు క్యాష్ చేసుకోవాలని కోరారు. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఆడుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా బలమైందని తెలిపారు. ఫర్హాన్ సారధ్యంలోని ప్లేయర్ లందరూ చాలా యంగ్ అండ్ డైనమిక్ అన్నారు. వీళ్ళు కచ్చితంగా పాకిస్తాన్ జట్టును గెలిపిస్తారని నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్స్ అక్టోబర్ మూడవ తేదీన జరగనుంది. ఈ ఫైనల్ బరిలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మాత్రమే మ్యాచ్ జరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఫైనల్స్ రోజున వర్షం పడితే 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారని చెబుతున్నారు. లేకపోతే మ్యాచ్ రద్దు అయితే మాత్రం గోల్డ్ మెడల్స్ రెండు జట్లు పంచుకోవాల్సి ఉంటుంది. క్వార్టర్ ఫైనల్స్ తో పాటు సెమీఫైనల్స్ లో మాత్రం వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ర్యాంకింగ్స్ ప్రకారం విజేతను ఫైనల్ చేస్తారు.