BigTV English

Indian Navy is Stronger: ఇకపై నిఘా మరింత పటిష్ఠం.. భారత నేవీలోకి అధునాతన విమానాలు..

Indian Navy is Stronger: ఇకపై నిఘా మరింత పటిష్ఠం.. భారత నేవీలోకి అధునాతన విమానాలు..

Steps taken to strengthen Indian Navy: హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను భారత్ మరింత పటిష్ఠం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ నుంచి డజన్‌కి పైగా నిఘా విమానాలను భారత్ త్వరలో కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.


దేశ రక్షణ కోసం భారత్ అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటుంది. హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతంలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డజన్ల కొద్దీ నిఘా విమానాలను కొనుగోలు చేయనున్నట్లు రక్షణశాఖ మంత్రిరాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

విమానయాన దిగ్గజ సంస్థ ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ నుంచి భారత్ డజన్‌కి పైగా నిఘా విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సంస్థతో రూ.2,900 కోట్ల ఒప్పందాలను కుదుర్చుకుంది. మధ్యస్థ-శ్రేణి, బహుళ మిషన్‌ సముద్ర నిఘా విమానం భారత్‌ సముద్ర ప్రాంతంలోని దేశ నావికాదళం, కోస్ట్‌ గార్డ్‌ నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.


Read More: ఇస్రో శాస్ర్తవేత్తలకు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

ఈ నిఘా విమానాల్లో తొమ్మిది భారత నౌకాదళానికి, ఆరు కోస్ట్‌ గార్డ్‌కు వెళ్లనున్నాయి. వీటిని వీలైనంత త్వరగా మోహరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాలుగు సీ-295 విమానాలను ఎయిర్‌బస్‌ తయారుచేస్తుండగా.. మిగిలినవి భారత్‌లో తయారు కానున్నాయి. అరేబియా మహాసముద్రంలో డజన్ల కొద్దీ యుద్ధ నౌకలు, మానవరహిత వైమానిక వెహికిల్స్‌ను మోహరించింది. తాజాగా నిఘా విమానాలతో హిందూ మహాసముద్రంలోనూ సామర్థ్యాన్ని మరింత బలపరుచుకోనుంది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×