BigTV English
Advertisement

Indian Officer Dies: రాజౌరీలో పాకిస్తాన్‌ కాల్పులు.. భారత్ కీలక అధికారి మృతి

Indian Officer Dies: రాజౌరీలో పాకిస్తాన్‌ కాల్పులు.. భారత్ కీలక అధికారి మృతి

Indian Officer Dies: నీతి లేదు.. నియమం లేదు.. పాక్ తన వక్రబుద్ధిని ఇంకెప్పటికీ మార్చుకోదని మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉంది. ఇందుకు.. సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యల్ని చూస్తే అర్థమవుతుంది. భారత్ ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడితే.. పాక్ మాత్రం భారత సైనిక స్థావరాలు, కశ్మీర్ సరిహద్దుల్లోని గ్రామాలు, పౌరులపై దాడులకు తెగబడుతోంది.  ఇండియా యుద్ధం ప్రకటించిన కూడా పాక్ రెచ్చిపోతోంది.. ఇండియాని రెచ్చగొడుతోంది. కౌంటర్ ఎటాక్‌లని తట్టుకోలేక పదే పదే దెబ్బతింటోంది.


పాకిస్తాన్‌కు ఏమాత్రం బుద్ధి ఉన్నా.. ఏమాత్రం యుద్ధ నీతి ఉన్నా.. భారత పౌరుల్ని, పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయకూడదు. కానీ.. అది పాకిస్తాన్. ఇలాంటివేవి ఆ దేశానికి తెలియదు. భారత్‌పై విషం చిమ్మడం, మన దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేయడం, దొంగదెబ్బ తీసి.. తామే బాధితులుగా డ్రామా చేయడమే తెలుసు.

ఒక్క రాత్రిలో పాకిస్తాన్ వందల డ్రోన్లతో.. హమాస్ తరహాలో ఇండియాపై దాడికి తెగబడింది. అయినప్పటికీ.. పాక్ డ్రోన్లను సరిహద్దుల్లోనే కూల్చేసింది భారత్. అయితే శనివారం తెల్లవారుజామన రాజౌరీ ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో రాజౌరీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ థాపా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తమ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజౌరీ నుంచి ఓ భయంకరమైన న్యూస్ వచ్చిందని.. మనం జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు చెందిన అంకిత భావంతో పనిచేసే అధికారిని కోల్పోయామని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


రాజ్ కుమార్ థాపా శుక్రవారం నాడు డిప్యూటీ సీఎంతో కలిసి జిల్లాల్లో పర్యటించారని తెలిపారు. తాను అధ్యక్షతన వహించిన ఆన్‌లైన్ మీటింగ్‌కు కూడా హాజరయ్యారని తెలిపారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై పాక్ కాల్పులు జరిపిందని, రాజౌరీ పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని, మన అదనపు జిల్లా అభివృద్ది కమిషనర్ రాజ్ కుమార్ థాపాను చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: పాక్‌లో అంతర్యుద్ధం? సైన్యం తిరుగుబాటు? పాకిస్తాన్ షట్టర్ క్లోజ్

ఇదిలా ఉంటే.. దేశ రక్షణలో భాగంగా ఓ తెలుగు జవాను ప్రాణాలు కోల్పోయాడు. జమ్ము కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో జవాన్ మురళీ నాయక్ మృతి చెందిన సంగతి తెలిసిందే. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు మురళి. ఒక వేళ యుద్ధం జరగకపోయి ఉండే వచ్చే వారం సెలవులపై ఇంటికి వచ్చేవాడని తెలుస్తోంది. వారంలో ఇంటికి వస్తానని చెప్పిన మురళి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందుతున్నారు. మురళీనాయక్ బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘన నివాళి అర్పించారు.

చిన్నతనం నుంచి ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలని మురళి తహతహలాడేవాడు. ఒక్కరోజైనా ఆర్మీ యూనిఫామ్ వేసుకుని చనిపోవాలని అనుకునేవాడు. అటువంటి మురళి 2022లో ఆర్మీలో చేరాడు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్మీలో చేరే అవకాశం దక్కించుకున్నాడు.

Related News

New Aadhaar App: కొత్త ఆధార్ యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై అన్నీ అందులోనే, ఆ భయం అవసరం లేదు

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Big Stories

×