Big Stories

India-US: యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం

India-US: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం తెలిపింది. మణిపూర్‌ అల్లర్ల తర్వాత దేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

- Advertisement -

అమెరికా పూర్తిగా పక్షపాత వైఖరితో నివేదిక ఇచ్చిందని భారత్ దుయ్యబట్టింది. అమెరికా ఇచ్చిన నివేదికకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఈ అంశం గురించి ప్రస్తావించారు. భారత్‌ ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో ఈ నివేదిక ద్వారా అర్థమవుతోందని తెలిపారు.

- Advertisement -

అందుకే అమెరికా నివేదికకు తాము ఎలాంటి విలువ ఇవ్వడం లేదని తెలిపారు. మానవ హక్కుల విధానాలపై అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో మణిపుర్‌ అల్లర్లను ప్రస్తావించింది. అయితే ఈ సమయంలోనే భారత్ లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది.

Also Read:రేపే రెండో దశ ఎన్నికల పోలింగ్‌.. ఓటర్లకు ఐఎండీ కీలక హెచ్చరికలు..!

మణిపూర్  ఘటనలను ప్రధాని మోదీ సిగ్గుచేటని అభివర్ణించడంతో పాటు..వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కులకు సంబంధించిన అంశాలను సైతం ఇందులో పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News