BigTV English

Guy Whittall: జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు కుక్క

Guy Whittall: జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు కుక్క

Guy Whittall: ‘జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలు రా’.. అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకన్నారో గానీ.. తన శక్తికి మించి, ప్రాణాలకు తెగించి, ఒక చిరుతపులితో పోరాడి, తన యజమానిని కాపాడిన శునకం పేరు నెట్టింట రుగె మార్మోగిపోతోంది. ఈ ఘటనను వివరిస్తూ ఆ క్రికెటర్ సతీమణి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్ 51 ఏళ్ల ఆల్ రౌండర్ గై విట్టాల్ ఇటీవల హ్యుమని ప్రాంతంలో ట్రెక్కింగ్ కి వెళ్లాడు. వెళుతూ, వెళుతూ తన పెంపుడు శునకం, దాని పేరు చికారా.. దాన్ని కూడా వెంట తీసుకెళ్లాడు. అయితే అనూహ్యంగా ఎక్కడి నుంచో చిరుత వచ్చి అమాంతం దాడి చేసింది.

దాంతో ఆల్ రౌండర్ దభీమని కొండమీద నుంచి దొర్లుకుంటూ పడిపోయాడు. విషయాన్ని గమనించిన చికారా.. ఒక్క ఉదుటున చిరుతపై దాడి చేసింది. దాంతో చిరుతకి కోపం వచ్చి అది కూడా శునకంపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆల్ రౌండర్ కి చాలా గాయాలయ్యాయి. అయితే చికారా.. ఆ చిరుతను అడవిలోకి తరిమి తరిమి కొట్టింది. తర్వాత తిరిగొచ్చి, యజమానిని చూసింది.


అప్పటికే లేని శక్తిని తెచ్చుకుని ఫోనులో విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కి చెప్పి లోకేషన్ షేర్ చేయడంతో అధికారులు హుటాహుటిన హెలికాఫ్టర్ మీద వచ్చారు. మన ఆల్ రౌండర్ ని, చికారాని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం మనవాడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మూగజీవి చికారా కూడా కోలుకుంటోందని ఆల్ రౌండర్ సతీమణి తెలిపింది.

అయితే ఆల్ రౌండర్ గై విట్టాల్ కి మాత్రం కొండమీంచి పడటంతో పక్కటెముకలు, కాళ్ల ఎముకలు విరిగాయి. దీంతో శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మనవాడికి మూగజీవాలంటే చాలా ప్రేమనుకుంటాను. గతంలో ఒక ముసలి ఇలాగే ఏకంగా ఇంట్లోకి వచ్చి, తన మంచం కిందే పడుకుంది. విషయాన్ని ముందుగా గమనించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పినట్టు ఆల్ రౌండర్ సతీమణి తన పోస్టులో పేర్కొంది.

ఖాళీగా ఉండలేకపోతే, ఏ క్రికెట్ లేదా గోల్ఫ్ ఆడటానికో వెళ్లాలి గానీ అడవిలోకి వెళ్లడమేటి? సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఖాన పెట్టుకోవడం కాకపోతే అని కొందరు కామెంటు చేస్తున్నారు. మరికొందరు అంటున్నారు.. మా మాట అబద్ధమైతే చూడండి.. మన ఆల్ రౌండర్ దెబ్బలు తగ్గగానే ఆగిపోయిన తన ట్రెక్కింగ్ ని మళ్లీ పూర్తి చేస్తాడని ఛాలెంజ్ లు చేస్తున్నారు.

Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×