E-Paper
Advertisement

Indigo: ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ.. పాకిస్థాన్‌లో ల్యాండింగ్.. ప్రయాణికుడి మృతి

Indigo: ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ.. పాకిస్థాన్‌లో ల్యాండింగ్.. ప్రయాణికుడి మృతి
Advertisement

Indigo: విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు అస్వస్థతకు గురవ్వడం.. వెంటనే ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. తాజాగా ఢిల్లీ నుంచి ఖతార్ వెళ్తున్న ఇండిగో విమానంలో కూడా ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ఖతార్‌లోని దోహాకు ఇండిగో విమానం బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో పైలట్ ఫ్లైట్ దారి మళ్లించి పాకిస్థాన్‌లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

Advertisement

వెంటనే ఎయిర్‌పోర్ట్ మెడికల్ సిబ్బంది అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని పరీక్షించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్దారణ వచ్చారు. మృతుడు నైజీరియాకు చెందిన అబ్ధుల్లా(60)గా అధికారులు గుర్తించారు. ఇక మృతదేహంతో విమానం తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఇతర ప్రయాణికులను తిరిగి దోహా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అబ్దుల్లా మృతిపట్ల ఇండిగో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×