Android Auto: స్మార్ట్‌ఫోన్‌లో నావిగేషన్ కోసం చాలామంది Google Mapsనే ఉపయోగిస్తుంటారు. అయితే Android Autoలో గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేసే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. Here WeGo, Sygic, Magic Earth వంటి యాప్స్ కూడా రూట్ నావిగేషన్, ట్రాఫిక్ సమాచారం, ఆఫ్‌లైన్ మ్యాప్స్ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని ఉచితంగా లభిస్తే.. మరికొన్నింటిలో ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ కోసం సబ్‌స్క్రిప్షన్ అవసరం.
గూగుల్ మ్యాప్స్ తరహాలో పనిచేసే సిజిక్ ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫీచర్ కోసం ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దీనిలో రియల్‌టైమ్ ట్రాఫిక్ అలర్ట్స్, స్పీడ్ కెమెరా సమాచారం, వాయిస్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఉచిత వెర్షన్‌లో ఫీచర్లు చాలా పరిమితంగా ఉంటాయి.
Also Read: యాపిల్ మ్యూజిక్‌లో ఉన్న ఈ ఫీచర్లు యూట్యూబ్ మ్యూజిక్‌లో ఎందుకు లేవు?
గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా కొందరు Magic Earthను కూడా సూచిస్తున్నారు. ఉచిత వెర్షన్‌లో ప్రాథమిక నావిగేషన్, మ్యాప్ స్టైల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. పెయిడ్ ప్లాన్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆఫ్‌లైన్ మ్యాప్స్, లైవ్ ట్రాఫిక్, వాతావరణ సమాచారం, వాయిస్ గైడెన్స్ లభిస్తాయి. అయితే కొందరు యూజర్లు యాప్‌లో బగ్స్, క్రాష్ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.
Here WeGo గూగుల్ మ్యాప్స్‌కు దగ్గరగా ఉండే ఇంటర్‌ఫేస్‌తో సులభంగా ఉపయోగించుకోవచ్చు. స్టార్ట్, డెస్టినేషన్ ఎంటర్ చేస్తే రూట్స్, ప్రయాణ సమయం చూపిస్తుంది. రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల వంటి వివరాలను కూడా రూట్‌లో చూడొచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో ఇది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.
సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా Android Autoలో ఉపయోగించాలనుకుంటే Here WeGo మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. అదనపు ఫీచర్లు కావాలనుకునేవారు Sygic లేదా Magic Earthను కూడా పరిశీలించవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్ ఇప్పటికే అందిస్తున్న అనేక ఫీచర్లు వీటిలోనూ ఉండటంతో.. యాప్ మార్చాలా వద్దా అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Google Pixel 10 ధర భారీగా తగ్గింది.. అమెజాన్‌లో రూ.15 వేలకు పైగా ఆదా చేసే ఛాన్స్!