BigTV English

Infosys NarayanaMurthy | ఉద్యోగం నిరాకరించిన విప్రో.. కోపంతో ఇన్ఫోసిస్ స్థాపించిన నారాయణమూర్తి!

Infosys NarayanaMurthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణమూర్తి(77) తన జీవితంలో ఒకసారి విప్రో కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన దరఖాస్తు తిరస్కరించబడింది. నారాయణమూర్తి తనకు ఉద్యోగం లభించకపోవడంతో తన భార్య, మిత్రుల సహాయంతో విప్రోకు పోటీగా ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించారు.

Infosys NarayanaMurthy | ఉద్యోగం నిరాకరించిన విప్రో.. కోపంతో ఇన్ఫోసిస్ స్థాపించిన నారాయణమూర్తి!

Infosys NarayanaMurthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణమూర్తి(77) తన జీవితంలో ఒకసారి విప్రో కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన దరఖాస్తు తిరస్కరించబడింది. నారాయణమూర్తి తనకు ఉద్యోగం లభించకపోవడంతో తన భార్య, మిత్రుల సహాయంతో విప్రోకు పోటీగా ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించారు.


సాఫ్ట్‌వేర్ దిగ్గజం.. బిలయనీర్ బిజినెస్‌మెన్ నారాయణమూర్తి శనివారం ఒక మీడియా ఇంటర్‌వ్యూలో ఈ విషయం వెల్లడించారు. తనకు విప్రోలో ఉద్యోగం దొరకలేదనే ఆలోచనతో ఇన్ఫోసిస్ స్థాపనకు బీజం పడిందని ఆయన తెలిపారు. ఈ విషయం విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్‌జీకి కూడా తెలుసునని ఆయన చెప్పారు. ఒకసారి అజీమ్ ప్రేమ్‌జీ తనతో మాట్లాడుతూ.. “ఆ రోజు మీకు ఉద్యోగం నిరాకరించడం విప్రో కంపెనీ పెద్దలు చేసిన అతి పెద్ద తప్పుడు నిర్ణయాలలో ఒకటి. మీకు విప్రోలో ఉద్యోగం లభించి ఉంటే విప్రో కంపెనీ మరోలా ఉండేది,” అని అన్నారని గుర్తుకు చేసుకున్నారు.

1981 సంవత్సరంలో నారాయణ మూర్తి తన ఆరుగురు మిత్రులతో కలిసి తన భార్య ఇచ్చిన 10 వేల రూపాయల పెట్టుబడితో ఇన్ఫోసిస్ స్థాపించారు. ఇటు నారాయణ మూర్తి ఒక పేదవాడు. తన వద్ద ఇన్ఫోసిస్ స్థాపించినప్పుడు ఏ మాత్రం ధనం లేదు.. మరోవైపు అజీమ్ ప్రేమ్‌జీ ఒక బడా వ్యాపార సంస్థ విప్రోకు వారసుడు. విప్రో కంపెనీ ఒక వనస్పతి నూనె బిజెనెస్ చేసే సంస్థ.. కానీ అజీమ్ ప్రేమ్‌జీ దాన్ని ఒక ఐటి సాఫ్ట్‌వేర్ కంపెనీగా మార్చేశారు.


తాజాగా జనవరి 12 వరకు విప్రో కంపెనీ నికర ఆస్తుల మార్కెట్ విలువ 2.43 లక్షల కోట్లు మరోవైపు నారాయణ మూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 6.65 లక్షల కోట్లు.

నారాయణమూర్తి ఇన్ఫోసిస్ స్థాపించేముందు IIM అహ్మదాబాద్‌లో రీసెర్చ్ అసోసియట్‌గా పనిచేసేవారు. ఆ తరువాత 1960వ దశకంలో తన మిత్రుడితో కలిసి ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో చీఫ్ సిస్టెమ్స్ ప్రొగ్రామర్‌గా ఉద్యోగం చేశారు. అక్కడ TDC 312 అనే కంప్యూటర్ బేసిక్ ఇంటర్ ప్రెటర్‌ని కనుగొన్నారు. ఇలాంటి కంప్యూటర్ ఇండియాలోనే మొదటిది. కొంతకాలం తరువాత నారాయణమూర్తి తన సొంత ఐటి కంపెనీ సాఫ్ట్రానిక్స్‌ని స్థాపించారు. కానీ అది ఫలించలేదు. ఆ తరువాత విప్రోలో ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. మరో ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ని స్థాపించారు.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×