BigTV English

IRS Officer Anukathir Surya: జెండర్ మార్చుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్.. సివిల్ సర్వీస్ చరిత్రలో ఇదే తొలిసారి!

IRS Officer Anukathir Surya: జెండర్ మార్చుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్.. సివిల్ సర్వీస్ చరిత్రలో ఇదే తొలిసారి!

IRS Officer Anusuya to Anukathir Surya: భారతదేశ చరిత్రలో తొలిసారి ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ జెండర్ మార్చుకొని సంచలనం సృష్టించారు. ఓ లేడీ ఆఫీసర్ తన జెండర్‌ను మార్చుకొని లేడీ నుంచి పురుషుడిగా మారారు. ఇలా జెండర్‌తో పాటు తన పేరును కూడా మార్చాలని ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన అనసూయ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. తాజాగా, కేంద్రం రూల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి జెండర్‌తోపాటు పేరును అనసూయ నుంచి అనుకతిర్ సూర్యగా ఆమోదం తెలిపింది. ఇలా జెండర్‌ను మార్చుకున్న తొలి ఐఆర్ఎస్ అధికారిగా రికార్డు సృష్టించారు.


హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబునల్ చీఫ్ కమిషనర్ ఆఫీస్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఎం.అనసూయ..పుట్టుకతో స్త్రీగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ఇందులో ‘ ఇటీవల మా ఆఫీస్‌కు ఓ విన్నపం అందింది. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీఈఎస్‌టీఏటీ ఏఆర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తనకు సంబంధించిన అన్ని ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్చాల్సిందిగా అభ్యర్థించారు. అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నాం.’ అని వెల్లడించింది.


తమిళనాడులోని చెన్నైకి చెందిన అనసూయ.. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఈసీలో బ్యాచిలర్ డగ్రీ పూర్తి చేశారు. అనంతరం 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 2018లో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్ స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా చేశారు. గతేడాది హైదరాబాద్‌లోని సీఈఎస్‌టీఏటీ ఏఆర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధుల్లో చేరారు.

Also Read: ముస్లిం మహిళలకు భరణం, సుప్రీంకోర్టు కీలక తీర్పు..

2014లో జెండర్ మార్పుకు సంబంధించిన నల్సా కేసు మరోసారి గుర్తుకొచ్చింది. గతంలో ఓడిశాకు చెందిన ఓ అధికారి విధుల్లో చేరిన అనంతరం లింగమార్పిడి చేసుకున్నారు. అనంతరం తనను స్త్రీగా గుర్తించాలని కోర్టును కోరారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వ్యక్తులు తాము పురుషులుగా ఉండాలి లేదా స్త్రీగా ఉండాలా అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. ఆ తర్వాత తన పేరును ఐశ్వర్య రీతుపర్ణ ప్రధాన్‌గా అధికారిక రికార్డుల్లో మార్పు చేసుకున్నారు.

Tags

Related News

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Chief Ministers: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో చంద్రబాబు

Big Stories

×