India Pakistan War : పాకిస్థాన్‌తో ఘర్షణ జరిగినా.. ఆఖరికి యుద్ధం జరిగినా.. మూడో దేశం జోక్యం చేసుకోవడం భారత్‌కు ససేమీరా నచ్చదు. మధ్యలో వచ్చి మధ్యవర్తిత్వం చేస్తామంటే మాత్రం అస్సలు అంగీకరించదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతోంది. కానీ రీసెంట్‌గా జరిగిన పరిణామాలు మాత్రం కాస్త షాకింగ్‌గా మారాయి. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా సడెన్‌గా సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని చెప్పడం.. వెంటనే ఇరు దేశాలు నిజమని అంగీకరించడం జరిగిపోయాయి. దీనిపై NDA సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది. అసలు అమెరికా జోక్యం ఎందుకు చేసుకుందని.. అమెరికా ఈ ప్రకటన చేయడం ఏంటని తీవ్ర విమర్శలు దేశ వ్యాప్తంగా వచ్చాయి.
పాక్ న్యూక్లియర్ స్థావరాలు సేఫేనా?
పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసింది. వాటిని ఆధారాలతో సహా ఇప్పటికే ప్రపంచం ముందు పెట్టింది. దాడులు కేవలం ఎయిర్‌బేస్‌లపై మాత్రమే కాకుండా.. న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా టార్గెట్ చేసిందనే విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు అనేక బేస్‌లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. అందులో కిరాణా హిల్స్‌లోని బేస్ కూడా ఉంది. మిగతా బేస్‌ల కంటే ఇది కాస్త భిన్నమని చెప్పాలి. ఇది సాధారణ మిలటరీ స్థావరం మాత్రమే కాదు.. ఇక్కడే పాకిస్థాన్ అణు ఆయుధాలను దాచి ఉంచింది. కాస్త దూరంలోనే ఉన్న సర్గోధా ఎయిర్‌బేస్‌పై భారత్ దాడులు చేసింది.
అమెరికా పసిగట్టిందా?
త్రివిధ దళాలు అసలు విషయం పూర్తిగా చెప్పినట్టు లేవు. పాక్ న్యూక్లియర్ స్థావరాల సమీపంలో కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ భారత్ దాడి చేయగానే పాక్‌తో పాటు అమెరికా కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. న్యూక్లియర్ ఫెసిలిటీ సమీపంలో దాడి జరిగిన విషయం పాకిస్థాన్‌కు అమెరికాకు చెప్పిందా? లేదా అమెరికానే గుర్తించిందా? అనేది ఇంకా తేలలేదు కానీ.. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ న్యూక్లియర్ సెఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ పాక్ గగన తలంలో చక్కర్లు కొట్టింది.
పాక్ నుంచి రేడియేషన్ లీక్?
B-350 AMS ఎయిర్‌క్రాఫ్ట్ రేడియేషన్ లీక్‌తో పాటు.. పరిస్థితిని అంచనా వేసింది. దీనికి సంబంధించిన సమాచారం అగ్రరాజ్యానికి చేరడం.. అక్కడి నుంచి పాకిస్థాన్‌కు కాల్ వెళ్లడం.. వెంటనే భారత్ DGMOతో మాట్లాడాలని ఆదేశించడం జరిగిపోయింది. ఈ దాడులు జరిగాయా లేదా అనేది పాక్ చెప్పుకునే స్థితిలో లేదు.. భారత్ ఎలాగూ చెప్పదు.
అణు ముప్పు పొంచిఉందా?
తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ పదే పదే పాక్ మంత్రులు జబ్బలు చరుచుకున్నారు. అవసరమైతే ప్రయోగిస్తామని వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. అలాంటి ప్రమాదం జరగకుండా.. తాము తలుచుకుంటే మీ న్యూక్లియర్ ఫెసిలిటీస్‌ను కూడా నిర్వీర్యం చేయగత సత్తా ఉందని ప్రూవ్ చేసింది భారత్. అందుకే, అణు ముప్పు పొంచిఉన్న అత్యవసర పరిస్థితి రావడంతో సీన్‌లోకి అమెరికా ఎంటర్ అయినట్టు తెలుస్తోంది.
Also Read : ఆ గన్స్ మాకివ్వండి.. పాక్ సంగతి తేలుస్తాం..