Muharram festival: మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల, ఇస్లామిక్ నూతన సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. షియా ముస్లింలకు ఈ పండుగ ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పండుగ ఇది చంద్రుని నెలవంకపై ఆధారపడి ఉంటుంది. జూన్ 26న చంద్రుడు కనిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రకారం జూన్ 27 నుండి ముహర్రం ప్రారంభమైంది. దీంతో పదో రోజు అయిన ఆషురా రోజు అంటే.. ఇవాళ మొహర్రం పండుగ జరుపుకోవాలి.. అయితే, నెలవంక ఆలస్యం కావడంతో.. రేపు పండుగ జరుపుకోనున్నారు.
మనదేశంలో మొహర్రం పండుగ పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తారు. దీని వల్ల బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు క్లోజ్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. జూలై 6 ఆదివారం కావడంతో బ్యాంకులు ఈ రోజు మూసివేసిన విషయం తెలిసిందే. కాబట్టి మొహర్రం రోజు జరిగితే అదనపు హాలిడే అవసరం లేదు. అయితే, పండుగ జూలై 7న జరిగితే, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు రేపు మూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. ఈ రాష్ట్రాలు సాధారణంగా మొహర్రం సందర్భంగా అధికారికంగా బ్యాంక్ హాలీడేను ప్రకటించనున్నాయి.
ALSO READ: MIL: ఎమ్ఐఎల్‌లో ఉద్యోగాలు.. తక్కువ కాంపిటేషన్, అప్లై చేస్తే జాబ్ బ్రో
మొహర్రం రోజున బ్యాంకులతో పాటు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు మూసివేయనున్నారు. పండుగ రోజున షియా ముస్లింలు ఇమామ్ హుస్సేన్‌ను స్మరించుకుంటూ ఊరేగింపులు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. 680 ADలో కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో వారి త్యాగాన్ని సూచిస్తుంది. కర్బలా యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ ఇబ్న్ అలీ బలిదానాన్ని మొహర్రం గుర్తుచేస్తుంది. ఈ సందర్భంగా బ్యాంకు సేవలకు అంతరాయం కలగకుండా, ముఖ్యమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేయనున్నారు.
ALSO READ: Sama Rammohan: నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్య భేటీ.. సంచలన విషయాలు బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి
మొహర్రం పండుగ జులై 6న జరుగుతోందని ముందు భావించారు. నెలవంక ఆలస్యం కావడంతో రేపు పండుగను జరుపుకోనున్నారు. జూలై 7 సోమవారం హాలిడే అయితే, బ్యాంకులు, పాఠశాలలు, కార్యాలయాలను ప్రభుత్వం మూసివేయనుంది.