BigTV English

Visakha IT Hubs: IT కి అడ్డా @ విశాఖ 150కి పైగా కంపెనీలు.. సర్కార్ ఎంత భూమి ఇచ్చిందంటే.?

Visakha IT Hubs: IT కి అడ్డా @ విశాఖ 150కి పైగా కంపెనీలు.. సర్కార్ ఎంత భూమి ఇచ్చిందంటే.?

విశాఖలో ఇప్పటికే ఇన్‌ఫోసిస్, టెక్ మహింద్రా, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి 150 బడా కంపెనీలు రాబోతున్నాయి. దీంతో చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీఐసీసీ నిర్వహణలో భూములు కేటాయించింది.

మరో ఆరు నెలల్లో 15 కంపెనీలు విశాఖలో ఏర్పడే అవకాశం ఉంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్‌కు మధురవాడ సమీపంలో 80 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. గూగుల్ డేటా సెంటర్‌తో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దీంతోపాటు ఏఐ,క్లౌడ్ సర్టిఫికేషన్ మెంటార్ షిప్, కొత్త కంపెనీలు ఏర్పాటు చేసే యువతకు శిక్షణ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది.


విశాఖకు ఐటీ కంపెనీలు రావడంపై యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి నగరాలకు వెళ్లకుండా.. సొంత ప్లేస్‌లో ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు కూడా విశాఖలోని ప్రదేశాలు ఆహ్లాదాన్నిస్తాయని తెలిపారు.

నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు కలెక్టర్ హరేందిరా ప్రసాద్. రానున్న మూడేళ్లలో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఏపీలో క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తే.. విశాఖ దశ మారుతుంది అంటున్నారు సింబయాసిస్ ఐటీ కంపెనీ సీఈఓ నరేష్. ప్రభుత్వం ఐటీ పాలసీ తీసుకొచ్చి ముందు చూపుతో వ్యవహరించిందన్నారు.

Also Read: జగన్‌కి మళ్లీ షాక్.. 113 మందికి నోటీసులు

విశాఖ.. హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో పాటు మౌలిక వసతుల రూపకల్పన కూడా చేస్తుంది. ఇదేవిధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే రానున్న ఐదేళ్లలో ఎన్నో ఐటీ పరిశ్రమలు విశాఖలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×