BigTV English

Seine River: ఒకప్పుడు ఇది ప్యారిస్ కు మూసీనది.. ఇప్పుడు ఈ నీరు తాగినా ఏం కాదు.. ఎలా క్లీన్ చేశారంటే?

Seine River: ఒకప్పుడు ఇది ప్యారిస్ కు మూసీనది.. ఇప్పుడు ఈ నీరు తాగినా ఏం కాదు.. ఎలా క్లీన్ చేశారంటే?

హైదరాబాద్ కి మూసీనది ఎలాగో.. ప్యారిస్ కి సీన్ నది అలాంటిది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఘోరమైనది. పేరుకి నది అయినా అది ఓ పెద్ద సైజ్ మురుగు కాల్వ. ప్యారిస్ జనం మలమూత్రాలన్నీ ఆ నదిలోకే వెళ్తుంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీటిని నేరుగా తీసుకెళ్లి సీన్ నదిలో కలిపేస్తుంటారు. అందుకే ఆ నది నీరు అత్యంత దుర్గంధపూరితంగా ఉంటుంది. మురికి కంపు కిలోమీటర్ అవతలికి కూడా తెలుస్తుంది. అలాంటి సీన్ నదిలో ఇప్పుడు కొంతమంది జలకాలాడుతున్నారు. సీన్ నది గురించి తెలిసిన ఎవరైనా అలాంటిది అసాధ్యం అని అంటారు. కనీసం కాలు పెట్టడానికి కూడా భయపడే సీన్ నది నీటిలో దిగి జలకాలాడటం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు. అయినా కూడా ఇది నిజం. సీన్ నదిలో ఇప్పుడు స్వమ్మర్లకు స్వర్గధామంలా మారింది. అయితే ఆ మార్పు ఎలా సాధ్యమైందనేదే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం.


అప్పట్లో లవర్స్ స్పాట్..

సీన్ నదిలో డ్రైనేజీ నీరు పారడం అనేది కాలక్రమేణా జరిగిన మార్పు కానీ, గతంలో ఆ నది అత్యంత సుందరమైనది, అందమైన పరిసరాలతో, స్వచ్ఛమైన నీటితో ఆకట్టుకునేలా ఉండేది. అప్పట్లో దీనికి శృంగార నది అని కూడా పేరుండేది. దీని ఒడ్డున పెయింటింగ్‌ పోటీలు జరిగేవి. సీన్ నదీతీరం ప్రేమికులకు కేంద్రం. సీన్ నదిని చూస్తూ, ఆ పరిసరాలను ఆస్వాదిస్తూ ప్రేమికులు కాలం మరచిపోయేవారు. 1923వరకు సీన్ నదిలో జనాలు ఈత కొట్టేవారు. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి మారింది. డ్రైనేజీ నీరు కలవడంతో ఆ నదిలోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. అప్పట్నుంచి అది రోజు రోజుకి మురికి కూపంలా మారి, చివరకు మలమూత్రాలతో ప్రవహించే కంపు నదిగా మారిపోయింది. ఈకోలీ బ్యాక్టీరియా అధికంగా ఉండటంతో ఆ నీరు ఇతర ఏ అవసరానికి కూడా పనికి వచ్చేది కాదు.


1923 తర్వాత ఇప్పుడే..

గతేడాది ప్యారిస్ లో ఒలింపిక్స్ పోటీలు జరిగిన తర్వాత సీన్ నది స్వరూపం క్రమక్రమంగా మారింది. ఒలింపిక్స్ సందర్భంగా ప్యారిస్ లో పరిశుభ్రతా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. దీంతో సీన్ నదిలో కూడా క్లీనింగ్ ఆపరేషన్ మొదలైంది. అది ఇటీవలే పూర్తయింది. 1923 తర్వాత తొలిసారిగా ఈ ఏడాది జులై 5న సీన్ నదిలో జనం ఈతకోసం దిగడం విశేషం. ప్రజలు ఈతకొట్టేందుకు ఈ నది వద్ద ఉన్న గేట్లు తెరిచారు అధికారులు.

ఖర్చు ఎంతంటే..

సీన్ నదిని శుభ్రం చేసేందుకు, ఆ నది పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు ఒక బిలియన్ డాలర్లకు పైగా అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో భాగంగా పారిస్‌లో ఒక పెద్ద భూగర్భ వర్షపు నీటి నిల్వ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. భారీ వర్షాల సమయంలో ఎక్కువ ప్రవహించే నీటిని ఈ ట్యాంక్ లో నిల్వ చేసేవారు. దీంతోపాటు నివాస సముదాయాలనుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసేందుకు, అలా శుద్ధి చేసిన నీటిని తిరిగి వాడుకునేందుకు సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేశారు. సీన్ నదిలో కలిసే మురికి నీరు అలా ఆగిపోయింది. దీంతో ఆ నది పరిశుభ్రంగా మారింది. ఎప్పటికప్పుడు నదిలో నీటిని నాణ్యతా పరీక్షలకోసం పంపించేవారు. చివరకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలిన తర్వాత ఈనెల 5న ఈ నదిలో ఈత కొట్టేందుకు ప్రజల్ని అనుమతించారు.

Related News

China Military Parade: ఆ ముగ్గురు కలిస్తే తట్టుకోవడం కష్టమే.. భయంలో ట్రంప్

India USA: మోదీ మైండ్ గేమ్.. ట్రంప్ చాప్టర్ క్లోజ్! ఇండియా లేకపోతే అమెరికా పరిస్థితి ఇదే..

Japanese Restaurant: ఇదెక్కడి రెస్టారెంట్ రా బాబు.. వాళ్లు పిలిస్తేనే వెళ్ళాలా.. మనం వెళ్లకూడదా?

Nigeria: నైజీరియాలో పడవ బోల్తా.. 60 మంది మృతి, చెట్టును ఢీ కొనడం వల్లే..

Greece Population: గ్రీస్ లో జనాభా సంక్షోభం.. పిల్లలు లేక స్కూల్స్ మూసివేత

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Big Stories

×