BigTV English

ISRO : నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2.. రాకెట్ ప్రయోగం విజయవంతం..

ISRO : నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2.. రాకెట్ ప్రయోగం విజయవంతం..

ISRO : ఇస్రో చేపట్టిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం చేపట్టారు. వేకువజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 6.30 గంటలపాటు కొనసాగింది. అనంతరం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. 3 ఉపగ్రహాలను ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్ కక్ష్యలోని ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. కేవలం 15 నిమిషాల్లో ప్రయోగం పూర్తైంది.


ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవోఎస్‌-07 ఉపగ్రహంతోపాటు యూఎస్‌ఏ అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానెస్‌-1, చెన్నై స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీ శాట్‌-2ను నింగిలోకి పంపించారు. ఈ 3 ఉపగ్రహాలను రాకెట్ భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్‌-07, 880 సెకన్లకు జానెస్‌-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీ శాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టంది. దీంతో ప్రయోగం విజయవంతమైంది.

ఇది షార్‌ నుంచి చేపట్టిన 84వ ప్రయోగం. ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డి సిరీస్‌లో రెండోది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొ­దటి ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీ డీ2 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.


Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×