BigTV English

Google Play Store:- ఈ యాప్స్‌లో లోన్ తీసుకున్నారా… గూగుల్ ఆల్రడీ డిలీట్ చేసేసిందేమో చూడండి

Google Play Store:- ఈ యాప్స్‌లో లోన్ తీసుకున్నారా… గూగుల్ ఆల్రడీ డిలీట్ చేసేసిందేమో చూడండి

Google Play Store:- లోన్ యాప్స్ భరతం పట్టింది గూగుల్. ఏకంగా 3500 లోన్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తీసేసి సంచలనం సృష్టించింది. ఈ లోన్ యాప్స్ వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో. ఎంతమందికి కడుపుకోత మిగిల్చాయో. లోన్ కట్టినా సరే.. వేధించాయి. మనిషి చనిపోయినా సరే.. తల్లిదండ్రులను సైతం వదల్లేదు. ఎంతోమంది పరువును బజారుకీడ్చాయి యాప్ లోన్స్. అడ్డదిడ్డంగా వడ్డీలు బాదుతూ, హిడెన్ ఛార్జీలు వేస్తూ… కట్టాల్సిన దాని కంటే ఎక్కువ అమౌంట్ గుంజుకున్నాయి. వీటిపై కంప్లైంట్స్ వెళ్లడంతో.. తమ పాలసీకి విరుద్దంగా ఉన్నాయంటూ ఒక్కసారిగా కొరడా ఝుళిపించింది గూగుల్. చాలా కాలంగా అలాంటి లోన్ యాప్స్‌పై ఓ కన్నేసి ఉంచి, వాటి పనితీరును ట్రాక్ చేసిన గూగుల్.. 3500 యాప్స్ ను బ్యాన్ చేసింది. ఈ ప్రక్రియ ఒక ఏడాది కాలంగా జరుగుతోంది.


చట్టబద్ధంగా, రూల్స్‌కు అనుగుణంగా ఉంటేనే యాప్‌లను ప్లేస్టోర్‌లో ఉంచుతుంది గూగుల్. తన కస్టమర్లకు ఇబ్బంది కలిగించనంత వరకు ఓకే. అలా కాకుండా కొద్దిగా లైన్ తప్పినా సరే.. గూగుల్ వేటు వేస్తుంది. ఇప్పుడు చేసింది అదే. చట్టబద్ధంగా లేని రుణ యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. 2022లో ఇలాంటివి ఏకంగా 3,500 యాప్‌లను గూగుల్‌ తొలగించినట్లు ప్లే ప్రొటెక్ట్ రిపోర్ట్ వెల్లడించింది.

ఈ రిపోర్ట్‌ ప్రకారం.. గూగుల్‌ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 2022లో భారతదేశంలో 3,500 కంటే ఎక్కువ లోన్ యాప్‌లపై గూగుల్‌ చర్య తీసుకుంది. అంటే ఆ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది.


ఇండియాలో పర్సనల్ లోన్స్, ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌ల కోసం గూగుల్‌ కొత్త పాలసీ తీసుకొచ్చింది. నిజానికి, దీన్ని 2021లోనే అప్‌డేట్ చేసింది. యాప్స్ లోన్లు ఇవ్వాలంటే ఆర్బీఐ నుంచి లైసెన్స్‌ పొందినట్లు యాప్ డెవలపర్‌లు కచ్చితంగా ప్రూఫ్స్ చూపించాలి. లైసెన్స్‌ లేకపోతే లైసెన్స్ ఉన్న క్రెడిట్ కంపెనీలకు ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే తాము ఉన్నట్లు చూపించుకోవాలి. పైగా డెవలపర్ అకౌంట్ పేరు, రిజిస్టర్డ్ పేరు ఒక్కటే అయి ఉండాలి.

కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రుణ యాప్‌లకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసిన గూగుల్‌ ఉల్లంఘించిన యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×