BigTV English

Chandrababu – Pawan Kalyan: అక్కడ పవన్.. ఇక్కడ చంద్రబాబు.. బీజేపీకి బూస్ట్ ఇచ్చారా?

Chandrababu – Pawan Kalyan: అక్కడ పవన్.. ఇక్కడ చంద్రబాబు.. బీజేపీకి బూస్ట్ ఇచ్చారా?

Chandrababu – Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఉత్కంఠ భరితంగా ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఇక్కడే ఏపీ సీఎం చంద్రబాబు పేరు మార్మోగుతోంది. ఢిల్లీ ఎన్నికలకు బాబు ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. బాబు ప్రచారం సాగించిన నియోజకవర్గాల్లో అక్కడి బీజేపీ అభ్యర్థులు ఫలితాలలో ముందంజలో ఉన్నారు. దీనితో ఢిల్లీ ఫలితాలలో బాబు హవా సాగుతోందని అక్కడి మీడియా కోడై కూస్తోంది. మహారాష్ట్ర ఎన్నికలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం సాగించి బీజేపీకి అక్కడ బూస్ట్ ఇస్తే, ఢిల్లీలో బాబు కూడ బీజేపీకి బూస్ట్ ఇచ్చారని ఆయా పార్టీల క్యాడర్ ప్రచారం సాగిస్తోంది.


మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. అక్కడి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడే స్థిరపడ్డ తెలుగువారిని ఉద్దేశించి పవన్ చేసిన ప్రసంగం నాడు వైరల్ గా మారింది. పవన్ చేసిన ప్రసంగమే తమ గెలుపుకు కారణమని అక్కడి ఎమ్మెల్యేలు కూడ పవన్ ఫోటోతో ప్లెక్సీలు కూడ వేశారు. అలా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ సత్తా చాటితే, ఢిల్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు హవా సాగిందని ప్రచారం ఊపందుకుంది.

ఢిల్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీ మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగింది. అయితే ఇక్కడే ఢిల్లీలో స్థిరపడ్డ తెలుగువారిని ఆకర్షించేందుకు బీజేపీ పెద్ద ప్లాన్ వేసింది. మహారాష్ట్ర లో పవన్ ను రంగంలోకి దింపిన బీజేపీ, ఢిల్లీ ప్రచారానికి సీఎం చంద్రబాబును రంగంలోకి దింపింది. ఢిల్లీలోని షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్, సహద్ర వంటి ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం సాగించారు బాబు. ఈ నేపథ్యంలో బాబు ట్రెండ్ తో ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఫలితాలలో ముందంజలో ఉన్నారట.


Also Read: AP Govt: నిన్న పింఛన్.. నేడు ఇంటి పట్టాలు.. అనర్హులకు ఇక చుక్కలే..

బాబు తన ప్రచారంలో.. బీజేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలపై ప్రసంగించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పట్టం కట్టాలని బాబు ప్రచారం సాగించారు. తెలుగు వారు స్థిరపడ్డ ప్రాంతాలు కావడంతో బాబు చేసిన ప్రచారం బీజేపీకి బూస్ట్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ ఫలితాలలో తన మార్క్ చూపినట్లేనని ప్రచారం సాగుతోంది.

Related News

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

Big Stories

×