BigTV English

Jagdeep dhankhar: ‘వాళ్లు హద్దులు దాటారు’.. ఉపరాష్ట్రపతికి ఎన్డీయే ఎంపీలు నిల్చొని సంఘీభావం ..

Jagdeep dhankhar: ‘వాళ్లు హద్దులు దాటారు’.. ఉపరాష్ట్రపతికి ఎన్డీయే ఎంపీలు నిల్చొని సంఘీభావం ..

Jagdeep dhankhar: రాజ్యసభలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ లో వివక్షాల ప్రదర్శనపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కు మద్దతుగా ఎన్డీయే ఎంపీలు కొద్ది సేపు నిలబడి సంఘీభావం తెలియజేశారు. ధన్‌ఖడ్‌ను హేళన చేస్తూ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాన్ బెనర్జీ చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనను ఎన్డీయే ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ సైతం ఈ చర్యను ఖండించారు. ప్రధాని మోదీ సైతం ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్‌ చేసి సంఘీభావం తెలిపారు.


అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభలో మాట్లాడుతూ ‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారన్నారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని సైతం అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయినటువంటి రాష్ట్రపతిని సైతం అవమానించారు. జాట్‌ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ధన్ ఖడ్. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తిని అవమానించడం సిగ్గుచేటన్నారు” ప్రహ్లాద్ జోషి.

ఉపరాష్ట్రపతి ఉన్నతస్థానం పట్ల విపక్షాలకు గౌరవం లేదని ప్రహ్లాద్ జోషి అన్నారు . రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం తాము సహించలేక లేకపోతున్నామని విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాలు అన్ని రకాలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారన్నారు. ఉపరాష్ట్రపతిని హేళన ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నామన్నారు. గంట సేపు నిల్చొని సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×