BigTV English

‘Jai Shri Ram’ In Mosque: మసీదులో ‘జై శ్రీ రామ్’ జపించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

‘Jai Shri Ram’ In Mosque: మసీదులో ‘జై శ్రీ రామ్’ జపించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

‘Jai Shri Ram’ In Mosque| మసీదు లోపల జై శ్రీ రామ్ అంటూ జపించడం, అరవడం నేరం కాదని కర్ణాటక హై కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వ్యక్తులు మసీదులోపలికి వచ్చి జై శ్రీ రామ్ అంటూ గట్టిగా అరుపులు, కేకలు వేశారని.. దీని వల్ల తమ మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని వారిపై క్రిమనిల్ కేసులో నమోదు అయింది.


ఇద్దరు నిందితులపై ఐపిసి సెక్షన్ 295A(మతాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడం), ఐపిసి సెక్షన్ 447 (నిషేధిక ప్రాంతంలో ప్రవేశించడం), ఐపిసి సెక్షన్ 505 (బహిరంగ ప్రదేశంలో అల్లర్లు చేయడం), సెక్షన్ 506 (రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం) ప్రకారం కేసు నమోదైంది.

Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..


ఈ కేసుకి వ్యతిరేకంగా ఇద్దరు నిందితులు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారణ చేపట్టిన కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యం. నాగప్రసన్న ఈ కేసుని కొట్టివేశారు. విచారణ సమయంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ..” జై శ్రీ రామ్ అని నినాదాలు చేస్తే.. ఇతం మతం లేదా మరో వర్గం మనోభావాలు ఎలా దెబ్బతింటాయో తనకు అర్థం కావడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులే ఆ ప్రాంతంలో హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా నివసిస్తున్నారని పేర్కొన్నారు. మరి అలాంటి సందర్భంలో పిటీషనర్లకు (నిందితులు) వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. సుప్రీం కోర్ట ఆదేశాల ప్రకారం.. ఐపిసి సెక్షన్ 295Aని చిన్న చిన్న ఆరోపణల్లో ఉపయోగించకూడదు. కేవలం నినాదాలు చేసినంత మాత్రాన మతపరమైన అల్లర్లు జరుగుతాయని ఊహించకోవడం సరికాదు. నిందితుల చర్యలతో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని పేర్కొనడం సమంజసం కాదు. ” అని వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్ 24, 2023 రాత్రి 10.50 గంటలకు మసీదులో ఇద్దరు నిందితులు బలపూర్వకంగా ప్రవేశించి జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారని, మసీదు పరిసరాల్లో బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు. ఆ తరువాత నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే తమను పోలీసులు చట్ట వ్యతిరేకంగా అరెస్ట చేశారని.. నిందితులిద్దరూ కర్ణాటక హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది ఈ పిటీషన్ ని కొట్టివేయాలని.. ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ పొడిగించాలని.. కేసులో మరింత విచారణ చేయాల్సిన అవసరముందని కోర్టుని కోరారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

కానీ పిటీషన్ విచారణ చేసిన కోర్టు కేసు కొట్టివేసింది. కానీ హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా ఉన్న ప్రాంతాల్లో మతపరమైన అల్లర్లు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయడం సరికాదని కూడా వ్యాఖ్యానించింది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×