BigTV English

Chinese Soldiers : చైనా సైనికుల నోట.. ‘జై శ్రీరామ్‌’ నినాదాలు..

Chinese Soldiers : శతాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైంది. నూతన ఆలయంలో బాల రాముడి (Ram Lalla) ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేస్తున్నట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.

వాస్తవాధీన రేఖ వెంట (LAC) భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు సైతం జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది.

జై శ్రీరామ్‌ నినాదాన్ని ఎలా ఉచ్చరించాలన్న విషయాన్ని చైనా భద్రతా దళాలకు భారత్‌ సైనికులు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అందుకు తగినట్లుగానే చైనా సైనికులు ‘జై శ్రీరామ్‌’అంటూ నినాదాలు చేయడం కనిపించింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికి.. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఓ మాజీ సైనికుడు దీన్ని ‘ఎక్స్‌’లో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×