E-Paper
Advertisement

జంతర్ మంతర్ వద్ద అలజడి, సీఎం టార్గెట్.. పాక్ ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు!

జంతర్ మంతర్ వద్ద అలజడి, సీఎం టార్గెట్.. పాక్ ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు!
Advertisement

Jaish-e-Mohammed: స్వేచ్ఛ బ్యూరో: దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు చేసిన మరో భారీ కుట్ర బట్ట బయలయ్యింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా విధ్వంసం జరిపటంతోపాటు వెస్ట్ బెంగాల్ సీఎంను టార్గెట్ చేసిన పన్నాగాలు వెలుగులోకి వచ్చాయి. వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీ గౌరవ్ శర్మ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

నిఘా వర్గాల సమాచారంతో..

Advertisement

నిఘా వర్గాల సమాచారంతో కొన్ని రోజులుగా స్పెషల్ ఆపరేషన్ జరుపుతూ వచ్చిన ఎస్టీఎఫ్ పోలీసులు పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలున్న హమీమ్ మొండల్ అనే వ్యక్తిని పూర్బా బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు. విచారణలో హమీమ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో అశాంతి సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టుగా బయటపడింది.

జంతర్ మంతర్ ప్లాన్..

Advertisement

నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిపిన విషయం తెలిసిందే. దీంట్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిని అవకాశంగా చేసుకొని హింసను సృష్టించటానికి హమీమ్ పన్నాగం పన్నాడు. విద్యార్థులు చేపట్టిన నిరసనల్లోకి పోలీసు యూనిఫామ్‌ లో ప్రవేశించి, అక్కడ పెద్ద ఎత్తున అలజడి, అశాంతి సృష్టించాలన్న పాకిస్తాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఈ కుట్ర చేశాడు.

సీఎం టార్గెట్..

దాంతోపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కదలికలపై నిఘా పెట్టడం కూడా హమీమ్ లక్ష్యాల్లో ఒకటి. ముఖ్యమంత్రి ఎక్కడైనా భద్రత లేకుండా ఉన్న సమయాలను గుర్తించి ఆ సమాచారాన్ని సేకరించాలని అతనికి హ్యాండ్లర్ల నుంచి హమీమ్ కు ఆదేశాలు అందాయి. విచారణలో వెళ్లడైన వివరాల మేరకు హమీమ్ ప్రియురాలు అర్పితా సర్కార్‌ను జార్ఖండ్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. రాష్ట్ర మంత్రి ఉమేష్ రే కుమారుడిని హనీట్రాప్ చేసి కిడ్నాప్ చేసి వారి భారీగా డబ్బు వసూలు చేయడానికి వీరిద్దరూ కుట్ర పన్నినట్టు తేలింది. ఈ ఇద్దరు పాకిస్తాన్‌లోని ‘షాజాద్ భట్టి గ్యాంగ్’‌కు చెందిన ‘రాణా’, ‘ఉజైర్’, ‘ఆబిద్ జట్ 333’, ‘హమ్మద్’ వంటి హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ గ్యాంగ్ ఉగ్రవాద ప్రచారం, నియామకాలు, నార్కో టెర్రరిజం కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్టు అనుమానాలున్నాయి.

Also Read: రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

వీఐపీలపై హనీట్రాప్..

అర్పిత పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను హనీట్రాప్ చేసి సమాచారం సేకరించి హమీమ్‌కు అందించేదని ఎస్టీఎఫ్ ఐజీ గౌరవ్ శర్మ తెలిపారు. ఆమె వాట్సాప్ చాట్లలో పాకిస్తాన్ తో సంబంధాలు బయటపడ్డాయని చెప్పారు. హమీమ్, అర్పితా ఇద్దరూ మొదట ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమయ్యారన్నారు. నాలుగేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పేర్కొన్నారు. హనీట్రాప్ కేసు విచారణలో భాగంగా ఎస్టీఎఫ్ అధికారులు మొదట అర్పితా సర్కార్ సోషల్ మీడియా ఖాతాను నిశితంగా పరిశీలించగా ఆ లింక్ ద్వారా హమీమ్ మొండల్ అసలు రూపం వెలుగులోకి వచ్చిందన్నారు. వీరి వద్ద నుంచి బ్రిటన్, మెక్సికో దేశాలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లు, స్లీపర్ సెల్స్‌తో మాట్లాడేందుకు వీటిని ఉపయోగించినట్లు భావిస్తున్నారు.

పోలీస్ కస్టడీకి..

కోర్టు హమీమ్‌ను 14 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీకి అనుమతించింది. సోషల్ మీడియా ద్వారానే హమీమ్ తీవ్రవాద బాట పట్టినట్లు అతని ఫోన్, సోషల్ మీడియా హిస్టరీ ద్వారా తెలుస్తోంది. సరిహద్దుల అవతలి నుండి నడుస్తున్న ఈ ఉగ్ర నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందో, ఇందులో ఇంకా ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో తెలుసుకునేందుకు ఎస్టీఎఫ్ విచారణను ముమ్మరం చేసింది.

Also Read: ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!

Tags

Related News

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!

అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు కుట్ర కలకలం!

CJP కి నిధులు ఎలా వస్తున్నాయి? CBICకి ఆర్టీఐ కార్యకర్త సంచలన కంప్లైంట్!

ఇండియన్ ఆర్మీ ఇంటర్న్‌షిప్.. రూ.75,000 స్టైపెండ్‌.. విద్యార్థులకు అద్భుత అవకాశం

హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగ ఖాళీలు.. ఫ్రెషర్లకు సూపర్ ఛాన్స్.. ఈ రోజే అప్లై చేసేయండి

లీటర్ పెట్రోల్ రూ. 84కే ఇవ్వాలి! E20 వివాదంపై కేజ్రీవాల్ సంచలన డిమాండ్లు

కాక్రోచ్‌లకు మద్దతు ఇస్తే.. రూ.80 వేలు, ఆధారాలు సేకరించిన పోలీసులు

Big Stories

Advertisement
×