BigTV English

Masood Azhar : జైషే మహ్మద్ అధినేతపై బాంబుదాడి జరిగిందా.. ? మృతి చెందాడా? న్యూస్ వైరల్..

Masood Azhar : పాకిస్థాన్‌‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ‌ అధినేత మసూద్‌ అజహర్‌‌పై బాంబు దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ దాడిలో అతడు మృతిచెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి.పాకిస్థాన్‌‌లో గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు దాడులకు గురవుతున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటున్నాయి. పుల్వామా దాడిలో మసూద్‌ అజహర్‌ కీలకపాత్ర పోషించాడు.

Masood Azhar : జైషే మహ్మద్  అధినేతపై బాంబుదాడి జరిగిందా.. ? మృతి చెందాడా? న్యూస్ వైరల్..

Masood Azhar : పాకిస్థాన్‌‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ‌అధినేత మసూద్‌ అజహర్‌‌పై బాంబు దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ దాడిలో అతడు మృతిచెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్‌‌లో గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు దాడులకు గురవుతున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటున్నాయి.


పాక్‌లోని భవల్‌పూర్‌లో ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో మసీదు నుంచి మసూద్‌ తిరిగి వస్తుండగా దాడికి గురి అయినట్టు వార్తలు వస్తున్నాయి. మసూద్‌పై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటన స్థలంలోనే అతడు మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు ట్రెండ్‌ అవుతున్నాయి. అయితే మసూద్ అజహర్ మరణ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పాక్‌ అధికారిక పత్రిక అయిన డాన్, ఇతర స్థానిక మీడియాల్లోనూ ఈ దాడి గురించి ఎలాంటి కథనాలూ రాలేదు.

అయితే మసూద్‌పై బాంబు దాడి జరిగినట్లుగా పేర్కొంటూ వైరల్‌ అవుతున్న వీడియో పాత వీడియో అని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు పాక్‌స్థాన్‌లో నివాసం ఉంటున్నాడని అనుమానాలున్నాయి. అయితే మసూద్ అజహర్ తమ దేశంలో నివాసం ఉండటం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల అతడిపై దాడి జరిగినా దాని గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు.


మసూద్ అజహర్ పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థకు అధినేత. ఇండియాలో జరిగిన పలు భయంకరమైన దాడులలో ముఖ్య నిందితుడు. భారత ప్రభుత్వం 1995లో మసూద్ అజహర్‌ని అరెస్టు చేసింది. అయితే, 1999లో విమానాన్ని హైజాక్‌ చేసిన ఉగ్రవాదులు అతడిని భారత ప్రభుత్వం నుంచి విడిపించుకున్నారు. ఆ తర్వాత అతడు జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు. 2001లో ఇండియా పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించాడు. 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతను ముఖ్యపాత్ర వహించాడు.

2019లో జమ్మూకశ్మీర్‌లో పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మసూద్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటన తర్వాతే ఐక్యరాజ్యసమితి మసూద్‌ అజహర్‌‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×