BigTV English

New Year Party Murder | న్యూ ఇయర్‌ పార్టీ నుంచి పోలీస్ మిస్సింగ్.. మరుసటి రోజు ఎలా కనిపించాడంటే?

New Year Party Murder | అతను ఒక పోలీస్ ఆఫీసర్. ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు పొందిన క్రీడాకరుడు కూడా. డిసెంబర్ 31న స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీకి వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఫోన్ కూడా కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు అతని మృతదేహం కనిపించింది.

పంజాబ్‌లోని జలంధర్ నగరంలో సాయుధ పోలీస్ ప్రధాన కార్యాలయంలో పని చేసే దల్బీర్ సింగ్(54).. 200o ఆసియా క్రీడల పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. అందుకోసం భారత ప్రభుత్వం అతనికి అర్జున అవార్డు ప్రదానం చేసింది.

అయితే డిసెంబర్ 31 2023 సాయంత్రం తన స్నేహితులతో దల్బీర్ సింగ్.. న్యూ ఇయర్ పార్టీకి వెళ్లాడు. అలా వెళ్లిన అతను ఇంటికి తిరిగిరాలేదు. రాత్రి చాలా సేపటి వరకు కుటుంబ సభ్యులు అతని కోసం ఎదురు చూశారు. ఫోన్ కూడా కలవడం లేదు. ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల తరువాత పోలీసులకు నగర శివార్లలో ఒక మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించారు. శరీరమంతా గాయాలతో ఉన్న మృతదేహం దల్బీర్ పోలీకలతో ఉండడంతో అతని కుటుంబ సభ్యులకు కబురు చేశారు. ఆ శవం దల్బీర్‌దేనని అతని కుటుంబ సభ్యులు గుర్తించారు.

దల్బీర్ సింగ్ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. ఈ హత్య ఎవరు చేశారు? కారణాలు ఏంటి? అనేవి తదుపరి విచారణలో తెలుస్తుందని పంజాబ్ పోలీసులు అన్నారు.

Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×